Terrace Gardening: ఇంటికి కావాల్సిన ప్రతి పండు.. మేడ మీదే పండుతుంది

Terrace Gardening: మొక్కల పెంపకం ఇష్టమైన అభిరుచిగా ఉండేవారు చాలామందే ఉంటారు.

Update: 2021-10-08 09:32 GMT

Terrace Gardening: ఇంటికి కావాల్సిన ప్రతి పండు.. మేడ మీదే పండుతుంది

Terrace Gardening: మొక్కల పెంపకం ఇష్టమైన అభిరుచిగా ఉండేవారు చాలామందే ఉంటారు. అలాంటి వారిలో ఒకరు హైదరాబాద్‌లోని దమ్మాయిగూడకు చెందిన సూర్యప్రభావతి. మొక్కలపై మక్కువతో పాటు తమ కుటుంబానికి రసాయన రహిత ఆరోగ్యకరమైన ఆహార ఉత్పత్తులను అందించాలన్న తపనతో గత రెండేళ్లుగా మిద్దె తోట సేద్యం చేస్తున్నారు. మార్కెట్‌లో ఏం కొన్నా అవి ఎంతవరకు ఆరోగ్యకరం అన్న సందేహ పడి బోలెడన్ని డబ్బులు పోసి జబ్బులను కొనుక్కునేకన్నా ఆ భయాలు లేకుండా కూరగాయలనూ, పండ్లనూ ఇంటిమీదే చక్కగా పండించుకుంటున్నారు ఈ సాగుదారు. ఇళ్లాంతా పచ్చదనం కనిపిస్తుంటే కళ్లకు ఎంతో ప్రశాతంగా ఉందని అంటున్నారు సూర్యప్రభావతి. మిద్దె తోట ద్వారా ఎలాంటి కాలుష‌్యం లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో గడిపే స్వేచ్ఛ లభించిందంటున్నారు.

మొదట ఆకుకూరలతో తోట పనులు ప్రారభించిన సూర్యప్రభావతి క్రమంగా తోటను విస్తరిస్తూ వచ్చారు. ప్రస్తుతం ఆకుకూరలు, కూరగాయలు, పండ్లను ఇంటి మేడ మీద పండిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ తోట ఏర్పాటుకు పెద్దగా ఖర్చు చేయలేదంటున్నారు ఈ సాగుదారు. చిన్ని చిన్న కుండీలు, టబ్బుల్లో అన్ని రకాలను పెంచుతున్నానని చెబుతున్నారు. కంద, పసుపు, హైబ్రిడ్ బెండ, లాంగ్ బీన్స్, క్లో బీన్స్, పర్పుల్ బీన్స్, స్వీట్ లైమ్ రెడ్ క్యాబేజ్ వాక్కాయలు, ఇలా అరుదుగా లభించే ఎన్నో రకాలను తన మేడ మీద పెంచుతున్నారు. ఇలా కొత్త కొత్త వెరైటీలను పెంచడం , అందులో ఆరోగ్యం వుండటం తనకు ఎంతో ఇష్టమంటున్నారు సూర్యప్రభావతి.

అన్ని రకాల పండ్లకు నిలయం ఈ ఇళ్లు. ఇక్కడ పండని పండంటూ ఉండదు. ప్రత్యేకంగా మేడ మీద డ్రాగన్ ఫ్రూట్ సాగు చేస్తున్నారు సూర్యప్రభావతి. అంతే కాదు మేడ మీద ప్రత్యేక అలంకరణగా పూల సోయగాలు పలకరిస్తుంటాయి. వాటి ద్వారా ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు ఈ సాగుదారు. బియ్యం కడిగిన నీరు, వంటింట్లో నుంచి వచ్చిన వ్యర్థాలతోనో మిద్దె తోట సాగు చేస్తున్నానని చెప్పుకొచ్చారు ఈ మిద్దె సాగుదారు. ఇప్పటి వరకు తోటలో ఎలాంటి చీడపీడలు కనిపించలేదని. నాణ్యమైన ఆరోగ్యకరమైన దిగుబడిని సొంతం చేసుకుంటున్నామని అంటున్నారు. ఇలా వారానికి సరిపడా కూరగాయలను ఇంటి పట్టునే పండించుకుని తినడం ఎంతో సంతృప్తినిస్తోందంటన్నారు.

మేడ మీదే కాదు ఇంటి ముందు రకరకాల పండ్ల చెట్లను పెంచుతున్నారు. ఇంటి ముందు పందిరిపైన వేలాడుతూ కనిపించే ద్రాక్షా గుత్తులు తమకు మంచి అనుభూతిని కల్పిస్తాయంటున్నారు ఈ సాగుదారు. మార్కెట్‌లో హానికారక రసాయనాలతో మాగబెట్టే పండ్లను తిని కోరి అనారోగ్య సమస్యలను తెచ్చుకునే కంటే కాస్త సమయం, శ్రమను వెచ్చిస్తే.. ఇలా ఇంటింపట్టునే మనకు కావాల్సిన పండ్లను పండించుకోవచ్చని చెబుతున్నారు. 

Full View


Tags:    

Similar News