ఇంటిల్లిపాదికి సంవత్సరం పొడవునా తాజా కూరగాయలు, పండ్లు, ఔషధ మొక్కలు ఇస్తుంది మిద్దెతోట. ఆరోగ్యానికి భరోసా కూడా కల్పిస్తుంది. పట్టణ జీవనంలో దూరమైన మానసిక ఉల్లాసాన్ని తిరిగి తెస్తుంది. అన్నిటికి మించి ప్రకృతితో స్నేహం నేర్పిస్తుంది. అటు ఆరోగ్యన్ని పెంపొందించుకుంటూ ఇటు పర్యావరణ రక్షణలో భాగమయ్యే అనువైన వాతావరణం కల్పిస్తుంది మిద్దెతోట. ఆ విధంగానే గృహిణిగా ఉంటూ ఇంటి పంట సాగు చేస్తున్న కరీంనగర్ జిల్లాకి చెందిన జోత్స్న మిద్దె తోట విశేషాలపై ప్రత్యేక కథనం.
కరీంనగర్ జిల్లాకి చెందిన మిద్దె తోట నిర్వహకురాలు జోత్స్నకి మొదటి నుంచి మొక్కల మీద మమకారం ఎక్కువ, ఆ మక్కువతోనే పూల మొక్కలతో మొదలు పెట్టి నేడు సంవత్సరం పొడవునా తాజా కూరగాయలు, పండ్లు, ఔషధ మొక్కలను అందించే మిద్దె తోటను తీర్చిదిద్దారు. తాను, ఇంట్లో మిద్దె తోటలను సాగు చేయడమే కాదు తమ కాలనీ వాసులకు మిద్దె తోటలపై అవగాహన పెంచుతూ వారిని మిద్దె తోటల సాగుకు ప్రోత్సహిస్తున్నారు. వారి ఇంటిపంటలోని మరిన్ని విశేషాలను ఆమే మాటల్లోనే తెలసుకుందాం.
-పూర్తి స్టోరీ కోసం వీడియో చూడండి..