Telangana: 20 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్‌ సాగు లక్ష్యం

Telangana: దేశంలోనే ఈ పంటకు భారీ డిమాండ్‌ ఉంది.

Update: 2021-07-17 09:54 GMT

Telangana: 20 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్‌ సాగు లక్ష్యం

Telangana: దేశంలోనే ఈ పంటకు భారీ డిమాండ్‌ ఉంది. స్థానికంగా డిమాండ్‌కు తగ్గ సరఫరా లేకపోవడంతో ఏటా70 నుంచి 75 వేల కోట్ల రూపాయలు చెల్లించి మరీ ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. అంతటి విలువైన పంటే ఆయిల్‌పామ్‌ పంట. మన దేశ అవసరాలకు ప్రతి యేటా 22 మిలియన్ టన్నుల పామాయిల్ అవసరం. కానీ కేవలం ఏడు మిలియన్ టన్నులను మాత్రమే ఉత్పత్తి అవుతోంది. ఈ క్రమంలో ఆయిల్‌పామ్ సాగుకు ముందుకు వచ్చే రైతన్నలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీ ప్రోత్సాహకాలను ప్రకటించింది. రాష్ట్రంలో 20 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్‌ సాగు ను విస్తరించాలనే లక్ష్యంతో మూడేళ్లలో రైతులకు 36వేల రూపాయల ఆర్ధిక సాయాన్ని అందించాలని నిర్ణయించింది.

రానున్న 2022 -2023 సంవత్సరంలోగా 20 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్‌ సాగు చేపట్టే దిశగా రైతులను చైతన్యవంతం చేసేందుకు తెలంగాణ రాష్ట్ర సర్కార్‌ పలు ప్రోత్సాహకాలను అందించనుంది. ఆయిల్‌ పామ్‌ పంట నాలుగేళ్లకు చేతికి రానున్న నేపథ్యంలో రైతులకు పెట్టుబడి ఇబ్బందులు వచ్చే అవకాశముంది. దీంతో వారికి పంట పెట్టుబడి ప్రోత్సాహం కింద సబ్సిడీ అందజేయాలని ఇటీవల జరిగిన క్యాబినెట్ సమావేశంలో రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ప్రతి ఎకరాలకు మొదటి సంవత్సరం 26 వేల రూపాయలు , ఆ తరువాత రెండు, మూడు సంవత్సరాలలో 5వేల రూపాయల చొప్పున సబ్సిడీ ఇవ్వాలని తీర్మానించింది.

క్యాబినెట్ నిర్ణయంతో రాష్ట్రంలో ఆయిల్‌పామ్ సాగు భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ క్రమంలో సాగుకు అవసరమైన మొక్కల పెంపకానికి పలు శాఖలను భాగస్వామ్యం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. వ్యవసాయశాఖతో పాటు అటవీ, అటవీ అభివృద్ధి కార్పోరేషన్‌, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖల సహాయంతో ఆయిల్‌పామ్ మొక్కల నర్సరీలను పెంచాలని సూచించింది. అదే విధాంగా ఆయిల్ పామ్ సాగు విధి విధానాలు తెలుసుకునేందకు మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు కోస్టారికా, మలేషియా , థాయ్‌ల్యాండ్‌ , ఇండోనేషియా దేశాలలో పర్యటించాలని ఆదేశించింది.

దేశంలో పామాయిల్‌కు మంచి డిమాండ్ ఉంది. ప్రతి సంవత్సరం సుమారు 70 నుంచి 75 వేల కోట్ల విలువైన పామాయిల్‌ను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాము. దేశ అవసరాలకు ప్రతి ఏటా 22 మిలియన్ టన్నుల పామాయిల్ అవసరం ఉన్నా అంత మొత్తంలో ఉత్పత్తి లేదు. ఈ క్రమంలో ఆయిల్‌పామ్‌ను ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అంతే కాదు ఈ మధ్యకాలంలో ఆయిల్‌పామ్ గెలల ధర కూడా భారీగా పెరిగింది. క్వింటాలు గెల ధర 19 వేల వరకు పలుకుతోంది. అందుకే ఆయిల్‌పామ్ సాగును ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం దీనికి అనుబంధంగా జిల్లాల్లో కంపెనీల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటోంది. త్వరలోనే వీటిని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. 

Full View


Tags:    

Similar News