ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ లో భాగంగా మూడో రోజు రైతులకు సంబంధించిన అంశాలను ప్రస్తవించారు కేంద్రం ఆర్థికశాఖ మంత్రి నిర్మాల సీతారామన్ దేశంలో 85 శాతం మంది వ్యవసాయం చేస్తున్నాన్నారు. అందులో ఎక్కువ శాతం చిన్న, సన్నకారు రైతులవే ఉన్నట్టు కేంద్రం తెలిపింది. మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం లక్ష కోట్ల రూపాయాలు కేటాయిస్తున్నాట్లు కేంద్రం వెల్లడించింది. 11 పాయింట్ ఫార్మూలాతో రైతులకు లబ్ది చేకూరే విధంగా ఈ ప్యాకేజీ తయారు చేశారు. రానున్న రోజుల్లో రైతులు పండించిన పంటలను ఎక్కడైనా అమ్ముకునేందుకు చట్టం తీసుకురానున్నారు.
లాక్‌డౌన్ లో కుదేలు అయిన వ్యవసాయ రంగాన్ని ఆదుకునేందుకు కేంద్రం భారీ ప్యాకేజీ ప్రకటించింది. వ్యవసాయం, వాటి అనుబంధ రంగాలపై ప్యాకేజీ వివరాలు వెల్లడించారు. దేశంలో 85శాతం భూకమతాలు చిన్న, సన్నకారు రైతుల చేతిలో ఉన్నట్టు కేంద్రం తెలిపింది. రైతుల ఉత్పత్తుల కోసం కొత్త పథకాన్ని తీసుకొచ్చారు. ఆపరేషన్ గ్రీన్ పేరుతో కొత్త పథకాన్ని శ్రీకారం చుట్టారు రైతులను ఆదుకోవడానికి 11 సూత్రాల ఫార్మూలాను తీసుకొచ్చారు.
రైతుల మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం లక్ష కోట్ల రూపాయాల ప్యాకేజీని కేటాయించారు. రైతులు పండించిన పంటలను కనీస మద్దతు ధరతో రూ. 74,300 కోట్లతో కొనుగోలు చేసినట్టు కేంద్రం తెలిపింది. ఇప్పటికే పీఎం కిసాన్ సమ్మన్ నిధి ద్వారా రైతులకు 18,700కోట్లు బదిలీ చేశామని నిర్మాల సీతారామన్ వెల్లడించారు. రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేసిన పంటలకు నేరుగా ఖాతాల్లోనే జమ చేసినట్టు కేంద్రం మంత్రి తెలిపారు.
గడిచిన రెండు నెలల్లో రైతులను ఆదుకునేందుకు ఫసల్ బీమా కింద 6,400 కోట్ల పరిహారం చెల్లించినట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు. కోల్డ్ స్టోరేజీ, పప్పు ధాన్యాల స్టోరేజీ నిర్మాల కోసం భారీగా చేశామాన్నారు నిర్మాల సీతారామన్. రైతులు పండించిన పంటల ఉత్పత్తుల సరఫరాకు 500 కోట్ల రూపాయాలను విడుదల చేశామన్నారు. కోల్డ్ స్టోరేజీలో ఉన్న ఉత్పత్తులకు ఆరు నెలల పాటు రాయితీలు ఇస్తున్నాట్టు కేంద్రం తెలిపింది.
రైతులు పండించిన పంటలను కేంద్రం ప్రాంతాల వారిగా ప్రత్యేకంగా గుర్తించారు. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ నుంచి మిర్చికి, తెలంగాణ నుంచి పసుపుకు గుర్తింపు దక్కింది. రైతులు పండించిన పంటలను అమ్ముకునేందుకు ఈ-ట్రేడ్ పథకాన్ని తీసుకొచ్చారు. రైతులు పండించిన పంటలను ఎక్కడైనా అమ్ముకునేందుకు వీలు కల్పించనున్నారు. ఇందుకోసం జాతీయ స్థాయిలో ఒకే చట్టం అమల్లోకి రానుంది. రైతులు కోరిన ధరల గిట్టుబాటు అయ్యేలా కేంద్రం చర్యలు తీసుకుంటుందని కేంద్ర మంత్రి వెల్లడించారు. ధరలను నియంత్రించేందుకు ప్రత్యేక చట్టం తీసుకురానున్నారు.
నిత్యావసర వస్తువుల చట్టానికి సవరణ చేశారు. లాక్ డౌన్ పేదలకు టమాట, ఉల్లిగడ్డ, ఆలుగడ్డలు అందించేందుకు 500 కోట్లు కేటాయించారు. కనీస మద్దతు ధర స్కీంను మరో ఆరు నెలలు పొడిగించారు. రిటైలర్లతో రైతులు నేరుగా అనుసంధానం అయ్యేలా కేంద్రం చర్యలు తీసుకోనుంది. మొత్తానికి లాక్‌డౌన్ లో కుదేలు అయిన రైతులను ఆదుకునేందుకు భారీ మొత్తంలో ప్యాకేజీని ప్రకటించారు ఆర్థిక మంత్రి నిర్మాల సీతారామన్. రైతులకు లబ్ది చేకూరే విధంగా ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించారు.