లాభార్జనే ధ్యేయం కాదు..వాటి సంరక్షణే లక్ష్యం

గోవులు హిందువులకు ఎంతో పవిత్రమైన జంతువులు. వీటి నుంచి వచ్చే పాలు ఎంతో శ్రేష్టమైనవి. ఒకప్పుడు ఎద్దులు లేకుండా వ్యవసాయం చేయడం వీలుండేది కాదు. ప్రస్తుతం యంత్రాలోచ్చాయి.

Update: 2019-01-15 06:48 GMT
Goshala

గోవులు హిందువులకు ఎంతో పవిత్రమైన జంతువులు. వీటి నుంచి వచ్చే పాలు ఎంతో శ్రేష్టమైనవి. ఒకప్పుడు ఎద్దులు లేకుండా వ్యవసాయం చేయడం వీలుండేది కాదు. ప్రస్తుతం యంత్రాలోచ్చాయి. అయినా ఎద్దులతో పనులు ఇంకా అక్కడక్కడా కొనసాగుతున్నాయి. ఒకప్పపుడు పాడి పంట ఈ రెండు ఉంటేనే సిరుల పంట కానీ ఇప్పుడు మన గోసంతతి తరగిపోతోంది ఎన్నో అరుదైన జాతులు అంతరించిపోతున్నాయి ఇదే విషయాన్ని గుర్తించన పశ్చిమగోదావరి జిల్లా రైతు మన దేశీ గోవుల సంరక్షణకు నడుంబిగించాడు. లాభార్జనే ధ్యేయంగా కాకుండా అరుదైన మన గో సంతతిని రక్షించేందుకు గోశాలను నిర్వహిస్తున్న రైతు పెద్ది రాజుపై నేలతల్లి ప్రత్యేక కథనం.

వ్యవసాయం అంటే చాలా ఇష్టం అందులోనూ మూగజీవాలైన గోవులంటే ప్రాణం. ఆవులు ఇచ్చే పాల దిగుబడి కాదు. అరుదైన వాటి సంతతి అభివృద్ధే ధ్యేయమంటున్నారు పశ్చిమ గోదావరి జిల్లా కోడూరు మండలం కొమ్ము చిక్కాల గ్రామానికి చెందిన రైతు పెద్ది రాజు. 10 సంవత్సరాలుగా గోశాలను నిర్వహిస్తున్నారు. అరుదైన, అంతరించిపోతున్న దేశవాళీ గోవుల సంతతి సంరక్షణను కృషి చేస్తున్నారు ఈ రైతు.

దేశవ్యాప్తంగా ఉన్న 23 జాతులలో 6 జాతుల దేశవాళీ గోవులను అభివృద్ధి చేస్తున్నారు పెద్ది రాజు. పంజాబ్, హర్యాన, గుజరాత్ రాష్ట్రాల నుంచి ఆవులను తీసుకువచ్చి వాటి సంతతిని అభివృద్ధి చేస్తున్నారు. ప్రస్తుతం గోశాలలో 40 ఆవులు ఉన్నాయి. ఇందులో ఒంగోలు, పుంగనూరు, తార్ పార్కర్, గిర్, బోని షాహివాల్, కపిల వంటి దేశవాళీ జాతులు ఉన్నాయి. వీటి బ్రీడ్ అభివృద్ధే లక్ష్యంగా కృషి చేస్తున్నారు ఈ రైతు.

గోశాల నుంచి విడుదలయ్యే పశువుల వ్యర్థాలను తాను సాగు చేస్తున్న రొయ్యలు, చేపల చెరువులకు అందిస్తున్నారు. అంతే కాదు ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకు వారి అవసరాల మేర జీవమృతం, పేడను అందిస్తున్నారు. దేశీ గోవుల వ్యర్థాలలలో ఉన్న గొప్పతనాన్ని దశదిశలా వ్యాపింపచేయడమే తమ లక్ష్యమంటున్న పెద్ది రాజు అందుకోసం గో పంచకంతో మెడిసిన్‌ ను రూపొందించేందకు ప్రయత్నాలు చేస్తున్నారు. దీనితో పాటే తక్కువ ధరకే సెమెన్ బ్యాంకులను ఏర్పాటు చేసి దేశీ గోవులు బ్రీడ్‌లను అభివృద్ధి చేయాలన్న ఆలోచనలతో ముందుకు సాగుతున్నారు.

సంక్రాంతి వేల గోశాలలో సంవత్సరం పొడవునా రాజభోగాలను అనుభవించిన ఈ దేశవాళీ గిత్తలు పోటీలకు సై అంటాయి అందుకు అనుగుణంగా వాటిని నాటు పద్ధతుల్లో పెంచి సిద్ధం చేస్తున్నారు ఈ రైతు కనువ నాడు గోశాలలో పండుగ వాతావరణం నెలకొంటుంది. సాగు రంగంలో రైతుకు జీవనోపాధిగా నిలుస్తున్న గోవులకు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించి వాటిని అందంగా అలంకరిస్తామంటున్నారు పెద్దిరాజు.

తాను చేస్తున్న ఈ పనిని ఎన్నడూ వ్యాపారంలా చూడలేదంటున్నారు ఈ రైతు. లాభాల గురించి ఆలోచించనే లేదంటున్నారు. గోశాల నిర్వహణ ఖర్చుతో కూడుకున్నదే. కానీ ఆ పని నాకు ఎంతో సంతృప్తిని ఇస్తోందంటున్నారు పెద్దిరాజు. అందుకే లాభాల కన్నా సామాజిక కోణంలోంచి ఈ పనిని చూస్తున్నారు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.

Full View 

Similar News