తపనతో మిద్దె తోటల పెంపకం చేపడుతున్న...
పల్లెలు కాదు పట్టణాలు కాదు మిద్దె తోటలకు అంతటా ఆధరణ పెరుగుతుంది. ఈ నేపథ్యంలో ఇంటి పంటల సాగులో చాలా మంది నీటి సమస్యను ఎదుర్కొంటున్నారు.
పల్లెలు కాదు పట్టణాలు కాదు మిద్దె తోటలకు అంతటా ఆధరణ పెరుగుతుంది. ఈ నేపథ్యంలో ఇంటి పంటల సాగులో చాలా మంది నీటి సమస్యను ఎదుర్కొంటున్నారు. అంతేకాదు చాలా చోట్ల మిద్దె తోటలపై కోతులు దాడులు చేస్తున్నాయి అందుకే ఇవాళ్టి నేలతల్లి కార్యక్రమంలో ఇలాంటి పరిస్థితులను అధిగమించి రూఫ్ గార్డెన్ ని ఏవిధంగా నిర్మించుకోవాలన్న అంశాలతో సిద్ధమైంది ఈ వారం మిద్దె తోట స్పెషల్.
రసాయనిక అవశేషాల్లేని తాజా ఆకుకూరలు, కూరగాయలు , పండ్లు తినాల్న తపన ఉండాలే గానీ ఇంటిపట్టునే ఉంటూ పండించుకోవడానికి పుష్కలంగా అవకాశాలున్నాయని చాటిచెబుతున్నారు నారపల్లికి చెందిన రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి విద్యాసాగర్ గారు. వృత్తి రిత్యా విరమణ తీసిన్న విద్యాసాగర్ సొంత భవనాన్ని నిర్మించుకుని మేడమీద మిద్దె తోటల సాగు చేపట్టారు. తుమ్మేటి రఘోత్తమరెడ్డి గారి మిద్దె తోట చూసి స్పూర్తి పొంది మేడమీద ఖాళీ స్థలంలో సాశ్వత మడులను నిర్మించుకుని ఇంటిపంటల సాగుకు శ్రీకారం చుట్టారు. ఆరోగ్యకరమైన, ఆహ్లాదకరమైన జీవితాన్ని గడుపుతున్నారు.
మిద్దె తోటల సాగులో నీటి అవసరం ఎక్కువగా ఉంటుందని చాలా మందికి సందేహం ఉంటుంది అందువల్ల ఎంతో మందికి అభిరుచి ఉన్నా నీటి సమస్య ఉండడం వల్ల మిద్దె తోటల సాగుకు అంతగా ఆసక్తి చూపించడం లేదు నిజానికి మొక్కలకు రోజూ నీరు అందించిల్సిన అవసరం లేదంటున్నారు విద్యాసాగర్ గారు. మూడు రోజులకు ఒకసారి పంటలకు నీరు అందిస్తే సరిపోతుందంటున్నారు. నీరు ఎక్కువ మొత్తంలో అందించకుండా ఆరుతడి విధానంలోనూ మొక్కలను ఎంతో ఆరోగ్యంగా పండించుకోవచ్చంటున్నారు.
ఆరోగ్యదాయకమైన సేంద్రియ ఇంటి పంటలు సాగు చేసుకునే వారికి పల్లెలు, పట్టనాలన్న తేడా లేకుండా చాలా ప్రాంతాల్లో కోతుల బెడద పెద్ద సమస్యగా మారింది. కోతుల తాకిడికి తట్టుకోలేక మేడమీద ఇంటిపంటల సాగుకు స్వస్తి పలుకుతున్న వారు లేకపోలేదు. అయితే విశ్రాంత సమయంలో ఎంతో ఇష్టంగా ఇంటి పంటలను సాగు చేసుకుంటున్న విద్యాసాగర్ గారు కోతుల సమస్యను ఎలాగైనా అధిగమించాలన్న పట్టుదలతో కేజ్ గార్డెన్ ను ఏర్పాటు చేసుకున్నారు.