యూపీఎస్సీ పరీక్షల కొత్త షెడ్యూల్‌ విడుదల..

కరోనా వైరస్ ప్రభావంతో ఇప్పటి వరకు జరగాల్సిన పోటీ పరీక్షలన్నీ వాయిదా పడిన విషయం తెలిసిందే.

Update: 2020-06-06 13:14 GMT

కరోనా వైరస్ ప్రభావంతో ఇప్పటి వరకు జరగాల్సిన పోటీ పరీక్షలన్నీ వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్ంయలోనే సిలిల్స్ పరీక్షలు కూడా వాయిదా పడ్డాయి. కాగా ప్రస్తుతం దేశంలో లాక్ డౌన్ సండలింపులు ఇవ్వడంతో సివిల్స్‌ 2020కి సంబంధించిన పరీక్షల షెడ్యూల్‌ను యూపీఎస్సీ విడుదల చేసింది.

పాత షెడ్యూల్‌ ప్రకారం ప్రిలిమినరీ పరీక్షనే మే 31 నిర్వహించాల్సి ఉండగా కరోనా మహమ్మారి కారణంగా వాయిదా పడింది. కాగా యూపీఎస్పీ ఇచ్చిన తాజా నోటిఫికేషన్‌ ప్రకారం అక్టోబర్‌ 4, 2020న యూపీఎస్సీ సివిల్స్‌ ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్నారు. ఇక మెయిన పరీక్షల విషయానికొస్తే 2021, జనవరి 8 నిర్వహించనున్నారు. ఇక ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (మెయిన్) పరీక్ష 2021, ఫిబ్రవరి 28న జరుగుతుంది. ఇక 2020, జులై 20 నుంచి 2019 ఏడాదికి సంబంధించి నిర్వహించాల్సిన పర్సనాలిటీ టెస్టులు ప్రారంభమవుతాయని తెలిపింది.

పోటీ పరీక్షల తేదీలు:

NDA & NA (1&2)పరీక్షలు – సెప్టెంబర్‌ 6, 2020 న నిర్వహించనున్నారు.

ఐఈఎస్/ ఐఎస్ఎస్ పరీక్ష – అక్టోబర్ 16, 2020 న నిర్వహించనున్నారు.

సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షలు – అక్టోబర్ 4, 2020 నిర్వహించనున్నారు.

ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్(ప్రిలిమినరీ)- అక్టోబర్ 4, 2020న నిర్వహించనున్నారు.

కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ ఎగ్జామ్ – అక్టోబర్ 22, 2020న నిర్వహించనున్నారు.

సెంట్రల్ ఆర్మ్‌డ్‌ పోలిస్ ఫోర్సెస్ ఎగ్జామినేషన్- డిసెంబర్ 20, 2020న నిర్వహించనున్నారు.

సివిల్స్ మెయిన్ పరీక్ష – జనవరి 8, 2021 న నిర్వహించనున్నారు.

ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్(మెయిన్) పరీక్ష- ఫిబ్రవరి 28, 2021న నిర్వహించనున్నారు.


Tags:    

Similar News