B.Com చేసినవారికి బోలెడు అవకాశాలు.. ఈ రంగాల్లో మంచి జీతంతో ఉద్యోగాలు..!

B.Com చేస్తే భవిష్యత్‌ మంచి ఉద్యోగంలో స్థిరపడవచ్చు. వాణిజ్య రంగం రోజువారీ లావాదేవీలకు సంబంధించినది.

Update: 2023-08-08 07:45 GMT

B.Com చేసినవారికి బోలెడు అవకాశాలు.. ఈ రంగాల్లో మంచి జీతంతో ఉద్యోగాలు..!

B.Com చేస్తే భవిష్యత్‌ మంచి ఉద్యోగంలో స్థిరపడవచ్చు. వాణిజ్య రంగం రోజువారీ లావాదేవీలకు సంబంధించినది. బహుళజాతి కంపెనీలైనా, స్టార్టప్‌లైనా, ప్రతి ఒక్కరికీ అకౌంటింగ్‌లో నిపుణులైన వ్యక్తులు అవసరం. కామర్స్ రంగంలో కెరీర్ చేసే వారికి ఉద్యోగాలు ఏ విధంగా ఉంటాయో ఈరోజు తెలుసుకుందాం.

ఇంటర్‌ తర్వాత విద్యార్థులకు బి.కామ్ మంచి ఎంపిక. దీని తర్వాత అకౌంటింగ్, టాక్సేషన్, ఫైనాన్స్, కంపెనీ లా, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, గూడ్స్ అకౌంటింగ్ వంటి రంగాలలో కెరీర్ చేయవచ్చు. సాధారణ B.Com కాకుండా B.Com (Hons), B.Com in Financial Marketing, B.Com in accounting and Finance డిగ్రీని అభ్యసించవచ్చు. B.Com విద్యార్థులకు వాణిజ్యంతో పాటు, మేనేజ్‌మెంట్ స్టడీస్, ట్రావెల్ అండ్ టూరిజం, ఈవెంట్ మేనేజ్‌మెంట్, హోటల్ మేనేజ్‌మెంట్ వంటి రంగాలలో కెరీర్ అవకాశాలు ఉన్నాయి.

చార్టర్డ్ అకౌంటెంట్

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్ ఆఫ్ ఇండియా CA కోర్సును అందిస్తోంది. దీనికి ముందు కామన్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అంటే CPTలో ఉత్తీర్ణులై ఉండాలి. ఇంటర్‌ తర్వాత సీఏ చేయవచ్చు. ఇందుకోసం అకౌంటింగ్‌పై మంచి పరిజ్ఞానం అవసరం.

కంపెనీ సెక్రటరీ

కంపెనీ సెక్రటరీ లేదా CS అనేది వాణిజ్య విద్యార్థులకు బాగా ప్రాచుర్యం పొందిన కోర్సు. ఈ కోర్సును ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా ఆఫర్ చేస్తోంది. కోర్సు తర్వాత శిక్షణ పూర్తి చేయాలి.

కాస్ట్ అండ్ వర్క్స్ అకౌంటెంట్

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అండ్ వర్క్స్ అకౌంటెంట్ ఆఫ్ ఇండియా కాస్ట్ అకౌంటెన్సీలో కోర్సును అందిస్తోంది. 12వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు అడ్మిషన్ తీసుకోవచ్చు. సంవత్సరానికి రెండుసార్లు ప్రవేశ పరీక్ష ఉంటుంది.

బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో బ్యాచిలర్

BBA అనేది మూడు సంవత్సరాల కోర్సు. ఇందులో విద్యార్థులకు వ్యాపార నిర్వహణ గురించి సమాచారం అందిస్తారు. తర్వాత ఎంబీఏ చేయవచ్చు. తరువాత విద్యార్థులు HR, సేల్స్ & మార్కెటింగ్, ఫైనాన్స్ మొదలైన రంగాలలో ఉద్యోగాలు చేయవచ్చు.

Tags:    

Similar News