Teacher Jobs: అమెరికాలో టీచర్‌ ఉద్యోగాలకు డిమాండ్‌.. ఒక ప్రైవేట్‌ టీచర్‌ జీతం తెలిస్తే షాకవుతారు..!

Teacher Jobs: టీచర్లు దేశ భవిష్యత్‌కి చాలా అవసరం. వారి జ్ఞానం విద్యార్థుల భవిష్యత్‌ని నిర్ణయిస్తుంది.

Update: 2023-10-17 15:00 GMT

Teacher Jobs: అమెరికాలో టీచర్‌ ఉద్యోగాలకు డిమాండ్‌.. ఒక ప్రైవేట్‌ టీచర్‌ జీతం తెలిస్తే షాకవుతారు..!

Teacher Jobs: టీచర్లు దేశ భవిష్యత్‌కి చాలా అవసరం. వారి జ్ఞానం విద్యార్థుల భవిష్యత్‌ని నిర్ణయిస్తుంది. అందుకే ఏ దేశంలోనైనా ప్రభుత్వ టీచర్లకు మంచి జీతాలు ఉంటాయి. కానీ అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రైవేట్ టీచర్లకు కూడా మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఈరోజు అమెరికా ప్రైవేట్‌ టీచర్ల జీత భత్యాలు, అలవెన్సుల గురించి తెలుసుకుందాం.

టీచర్లు వారి పనికి అనుగుణంగా జీతం పొందడం చాలా అవసరం. అయితే అనుభవం, స్థానం, అదనపు అర్హతలను బట్టి జీతం నిర్ణయిస్తారు. సాధారణంగా ప్రైమరీ స్కూల్స్‌ టీచర్ల కంటే హై/మిడిల్ స్కూల్స్‌ టీచర్లు ఎక్కువ జీతం పొందుతారు. ఒక నివేదిక ప్రకారం 2022-23 సంవత్సరంలో అమెరికాలో టీజర్ సగటు జీతం $68,469 అంటే సంవత్సరానికి రూ.56,41,208. నెలవారీగా ఒక టీచర్‌కు రూ.4.50 లక్షల జీతం లభిస్తుంది. దీంతో పాటు ఇతర సౌకర్యాలు కూడా కల్పిస్తున్నారు. ఇక్కడ ప్రైవేట్ స్కూల్ టీచర్లకు కూడా మంచి జీతాలు లభిస్తున్నాయి.

నగరాలను బట్టి జీతాలు

అమెరికాలో నగరాలను బట్టి జీతాల నిర్మాణం మారుతూ ఉంటుంది. కాలిఫోర్నియాలో టీచర్లు అత్యధిక వార్షిక వేతనం $90,151 పొందుతున్నారు. అదే సమయంలో న్యూయార్క్‌లోని టీచర్లు ఏడాదికి $ 80,000 జీతం పొందుతారు. ఫ్లోరిడాలోని టీచర్ల వార్షిక ప్యాకేజీ అత్యల్పంగా $52,362 ఉంది. ఇండియాలోని టీచర్ల కంటే 10 రెట్లు ఎక్కువ. ఇక్కడ ప్రైమరీ టీచర్‌ నెల జీతం రూ.25,000, సెకండరీ స్కూల్ టీచర్‌ జీతం సంవత్సరానికి దాదాపు రూ. 5 లక్షలు. అయితే అనుభవంతో పాటు జీతం కూడా పెరుగుతుంది.

Tags:    

Similar News