Artificial Intelligence: ఇంటర్‌ తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ చదవండి.. భారీ జీతంతో ఉద్యోగాలు..!

Artificial Intelligence: ఇంటర్‌ తర్వాత ఎలాంటి కెరీర్‌ ఎంచుకోవాలో తెలియక చాలామంది విద్యార్థులు అయోమయంలో ఉంటారు. అలాంటి వారికి ఇది బెస్ట్‌ ఆప్షన్‌ అని చెప్పవచ్చు.

Update: 2023-08-03 15:00 GMT

Artificial Intelligence: ఇంటర్‌ తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ చదవండి.. భారీ జీతంతో ఉద్యోగాలు..!

Artificial Intelligence: ఇంటర్‌ తర్వాత ఎలాంటి కెరీర్‌ ఎంచుకోవాలో తెలియక చాలామంది విద్యార్థులు అయోమయంలో ఉంటారు. అలాంటి వారికి ఇది బెస్ట్‌ ఆప్షన్‌ అని చెప్పవచ్చు. ఎందుకంటే కాలం మారుతున్న కొద్ది టెక్నాలజీలో విప్లవాత్మకమైన మార్పులు వస్తున్నాయి. వాటికి తగ్గట్టుగా చదివితే లక్షల రూపాయల జీతంలో ఉద్యోగాల్లో చేరవచ్చు. ప్రస్తుతం ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్న పేరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌. ఇందులో కెరియర్‌ చేయడం వల్ల భారీ జీతంతో ఉద్యోగాలు కొల్లగొట్టవచ్చు. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

భవిష్యత్తులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ సహాయంతో పలు కంపెనీలు భారీ లాభాలను ఆర్జిస్తాయి. అందుకే ఈ రంగంలో నైపుణ్యం కలిగిన యువతకు డిమాండ్ వేగంగా పెరుగుతోంది. మనిషిలా ఆలోచించి యంత్రం ఏదైనా పని చేయడం ప్రారంభిస్తే దానిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటారు. టెర్మినేటర్, బ్లేడ్ రన్నర్, స్టార్ వార్, మ్యాట్రిక్స్, ఐ రోబోట్ వంటి ఎన్నో హాలీవుడ్ చిత్రాలు ఈ విషయంపైనే తీశారు.

ఈ టెక్నాలజీతో ఒక యంత్రం మానవ పనిని సులభంగా చేస్తుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని కంపెనీలను ఆకర్షిస్తోంది. సమస్య పరిష్కారాలు, కొత్త ప్రణాళికలు, కొత్త ఆలోచనలు కనుగొనడానికి AI ఉపయోగపడుతుంది. ప్రస్తుతం చాట్‌జిపిటి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత చాట్‌బాట్ వాడకం జరుగుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ చదవాలంటే 12వ తరగతిలో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్‌తో పాటు కంప్యూటర్ సైన్స్, ఐటీ, ఎలక్ట్రానిక్స్ వంటి సబ్జెక్టుల్లో డిగ్రీ కలిగి ఉండాలి.

ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చదవవచ్చు.

1. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ

2. చండీగఢ్ విశ్వవిద్యాలయం, చండీగఢ్

3. SRM ఈశ్వరి ఇంజనీరింగ్ కళాశాల, చెన్నై

4. కింగ్స్ కార్నర్‌స్టోన్ ఇంటర్నేషనల్ కాలేజ్, చెన్నై

5. సవిత ఇంజినీరింగ్ కళాశాల, చెన్నై

6. ఇంద్రప్రస్థ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IIIT), న్యూఢిల్లీ

ఎక్కువ జీతం

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ చదవడం వల్ల వచ్చే అతిపెద్ద ప్రయోజనం ఏంటంటే జీతం ఎక్కువగా ఉంటుంది. ఇంజినీరింగ్‌లోని ఇతర శాఖల కంటే ఈ కోర్సు చేసినవారికి ఎక్కువ జీతం లభిస్తుంది. భవిష్యత్తులో AI నిపుణులు ప్రతి రంగంలోనూ కనిపిస్తారు. పరిశ్రమ, డిజైనింగ్, స్పేస్, ఇంజనీరింగ్, మెడికల్‌లో ప్రతిచోటా ఉంటారు. AI కెరీర్‌ చేసిన తర్వాత ప్రారంభ ప్యాకేజీ నెలకు 70 వేల నుంచి లక్ష రూపాయల వరకు ఉంటుంది. 5 నుంచి 10 సంవత్సరాల అనుభవం తర్వాత ఇది నెలకు 4 నుంచి 5 లక్షల వరకు చేరుకుంటుంది.

Tags:    

Similar News