LIC Part Time Job: ఎల్‌ఐసీ పార్ట్‌ టైం జాబ్‌.. కేవలం 4 గంటలు పనిచేస్తే చాలు..!

LIC Part Time Job: ఈ రోజుల్లో పార్ట్‌ టైం ఉద్యోగాలు చేస్తూ చాలా వరకు సంపాదించవచ్చు.

Update: 2023-07-07 10:54 GMT

LIC Part Time Job: ఎల్‌ఐసీ పార్ట్‌ టైం జాబ్‌.. కేవలం 4 గంటలు పనిచేస్తే చాలు..!

LIC Part Time Job: ఈ రోజుల్లో పార్ట్‌ టైం ఉద్యోగాలు చేస్తూ చాలా వరకు సంపాదించవచ్చు. తాజాగా దేశంలో అతిపెద్ద బీమా సంస్థ అయిన లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎల్‌ఐసీ) పార్ట్‌ టైం ఏజెంట్‌గా పనిచేసే అవకాశాన్ని కల్పిస్తోంది. ఇందుకోసం పదో తరగతి పాసై ఉంటే సరిపోతుంది. ఎల్‌ఐసితో రోజుకు 4 గంటలు పని చేయడం ద్వారా నెలకి మంచి ఆదాయాన్ని సంపాదించవచ్చు. పార్ట్ టైమ్ ఏజెంట్‌గా చేరి ఇంట్లో కూర్చొని పనిచేయవచ్చు. క్లయింట్‌తో సంప్రదింపులు చేయవచ్చు. ఆదాయం ఎలా సంపాదించవచ్చో ఈరోజు తెలుసుకుందాం.

పార్ట్ టైమ్‌, ఫుల్ టైమ్ వర్క్‌

ఎల్ఐసీ పార్ట్‌టైమ్, ఫుల్‌టైమ్ మార్గాల్లో సంపాదించుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. ఇందుకోసం ముందుగా ఎల్ఐసీలో ఏజెంట్‌గా చేరాలి. తర్వాత మీకు కావలసినంత సంపాదించుకోవచ్చు. దీని ప్రత్యేకత ఏంటంటే ఎంత ఎక్కువ పని చేస్తే అంత ఎక్కువ కమీషన్ వస్తుంది. అంటే ఈ వ్యాపారంలో సంపాదన అపరిమితంగా ఉంటుంది.

అవసరమైన పత్రాలు

1. 6 పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు

2. 10వ తరగతి మార్క్ షీట్

3. చిరునామా రుజువు,

4. ఓటరు ID, ఆధార్ కార్డు

5. వాహనం నడపడానికి చట్టబద్ధమైన అర్హత

6. పాన్ కార్డ్ కాపీ

7. 25% వరకు కమీషన్

ఎల్ఐసి తన ఏజెంట్లకు పాలసీ మొత్తంలో 25% వరకు కమీషన్ చెల్లిస్తుంది. ఇది పాలసీ మొదటి విడతలో మాత్రమే వర్తిస్తుంది. తర్వాత కమీషన్ తగ్గుతూ ఉంటుంది. పాలసీదారు ఇన్‌స్టాల్‌మెంట్‌ను డిపాజిట్ చేసినన్ని సార్లు ఏజెంట్‌కు కమీషన్ లభిస్తుంది. ఏజెంట్ పాలసీని ఒకసారి చేయిస్తే సరిపోతుంది. తర్వాత ప్రతి ఇన్‌స్టాల్‌ మెంట్‌లో కమీషన్ లభిస్తుంది.

LIC ఏజెంట్‌గా ఎలా మారాలి..?

ఎల్‌ఐసీ ఏజెంట్ కావడానికి 10వ తరగతి ఉత్తీర్ణులై 18 ఏళ్లు నిండి ఉండాలి. నగరానికి సమీపంలోని ఎల్‌ఐసి బ్రాంచ్‌కి వెళ్లి అక్కడ డెవలప్‌మెంట్ అధికారిని కలవాలి. బ్రాంచ్ మేనేజర్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. మీరు ఈ ఉద్యోగానికి సరిపోతారని భావిస్తే శిక్షణ కోసం పంపుతారు. శిక్షణ 25 గంటల పాటు ఉంటుంది. ఇందులో మీకు జీవిత బీమా వ్యాపారం గురించి వివరంగా చెబుతారు. తరువాత IRDAI నిర్వహించే ప్రీ-రిక్రూట్‌మెంట్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలి. పరీక్షలో ఉత్తీర్ణులైన వారు బీమా ఏజెంట్ అపాయింట్‌మెంట్ లెటర్, గుర్తింపు కార్డును పొందుతారు.

Tags:    

Similar News