నిరుద్యోగులకి శుభవార్త.. ఎల్ఐసీలో ఉద్యోగాలు.. జీతం ఎంతంటే..?
LIC HFL Recruitment 2022: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (LIC) అసిస్టెంట్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
LIC HFL Recruitment 2022: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (LIC) అసిస్టెంట్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్ట్‌లకు దరఖాస్తు చేయాలనుకునే ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు lichousing.com వద్ద LIC HFL అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి అప్లై చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. ఈ రిక్రూట్మెంట్ ప్రక్రియలో మొత్తం 80 పోస్టులు భర్తీ చేస్తారు.
ముఖ్యమైన తేదీలు
1. ఆన్లైన్లో దరఖాస్తు చేయడానికి ప్రారంభ తేదీ - 04 ఆగస్టు
2. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ - ఆగస్టు 25.
3. మొత్తం పోస్టుల సంఖ్య- 80
4. అసిస్టెంట్ - అభ్యర్థి కనీసం 55% మార్కులతో గ్రాడ్యుయేట్ అయి ఉండాలి.
5. అసిస్టెంట్ మేనేజర్- అభ్యర్థి కనీసం 60% మార్కులతో గ్రాడ్యుయేట్ అయి ఉండాలి లేదా ఏదైనా విభాగంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ అయి ఉండాలి.
6. అసిస్టెంట్ ఉద్యోగానికి ఫీజు - రూ. రూ.800/-
7. అసిస్టెంట్ మేనేజర్ ఫీజు- రూ. రూ.800/
8. అసిస్టెంట్ జీతం – ప్రారంభ బేసిక్ పే రూ.22,730/- నెలకు
9. అసిస్టెంట్ మేనేజర్ జీతం– ప్రారంభ బేసిక్ పే రూ.80,110/- నెలకు
10. అసిస్టెంట్ - ఆన్లైన్ పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా
11. అసిస్టెంట్ మేనేజర్ (ఇతర వర్గం) - ఆన్లైన్ పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా