UPSC History: యూపీఎస్సీ ప్రస్థానం ఇలా మొదలైంది.. అత్యంత కఠినమైన పరీక్షల నిర్వహణ..!

UPSC History: కానీ అందులో కొద్ది మంది మాత్రమే పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఆఫీసర్ ర్యాంక్ ఉద్యోగాన్ని పొందుతారు. అయితే యూపీఎస్సీ ప్రస్థానం గురించి చాలా మందికి తెలియదు. ఇది ఎలా ఏర్పడిందో ఈరోజు తెలుసుకుందాం.

Update: 2023-07-13 11:31 GMT

UPSC History: యూపీఎస్సీ ప్రస్థానం ఇలా మొదలైంది.. అత్యంత కఠినమైన పరీక్షల నిర్వహణ..!

UPSC History: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) అనేది దేశంలోనే అత్యంత కఠినమైన పరీక్షలని నిర్వహిస్తుంది. పాలనకి సహకరించే ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఐఆర్‌ఎస్‌ వంటి ఉన్నత అధికారులని అందిస్తుంది. వాస్తవానికి యూపీఎస్సీ నిర్వహించే ప్రతి పరీక్షకు లక్షలాది మంది అప్లై చేసుకుంటారు. కానీ అందులో కొద్ది మంది మాత్రమే పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఆఫీసర్ ర్యాంక్ ఉద్యోగాన్ని పొందుతారు. అయితే యూపీఎస్సీ ప్రస్థానం గురించి చాలా మందికి తెలియదు. ఇది ఎలా ఏర్పడిందో ఈరోజు తెలుసుకుందాం.

దేశంలోనే అత్యంత కఠినమైన పరీక్ష

దేశంలోనే అత్యంత కఠినమైన సివిల్ సర్వీస్ పరీక్షను యూపీఎస్సీ మాత్రమే నిర్వహిస్తుంది. దేశవ్యాప్తంగా లక్షలాది మంది అభ్యర్థులు ఈ పరీక్షలో విజయం సాధించి ఐఏఎస్‌, ఐపీఎస్‌ లాంటి ఉన్నత ఉద్యోగాలని పొందాలని కలలు కంటారు.

యూపీఎస్సీ ప్రస్థానం

యూపీఎస్సీ 1926, అక్టోబర్‌లో ప్రారంభించారు. గతంలో దీనిని ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అని పిలిచేవారు. కానీ రాజ్యాంగం అమలులోకి వచ్చిన తర్వాత అది యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌గా మారింది.

యూపీఎస్సీ ప్రారంభం

1924లో లీ కమిషన్ చేసిన సిఫార్సుల కారణంగా యూపీఎస్సీని ప్రారంభించారు. దాదాపు రెండేళ్ల తర్వాత అంటే 1926లో భారత ప్రభుత్వ చట్టం 1919 ప్రకారం యూపీఎస్సీ స్థాపించారు.

మొదటి చైర్మన్

ఈ కమిషన్ ఏర్పాటు తర్వాత మొదటి ఛైర్మన్‌గా సర్ రాస్ బార్కర్ నియమితులయ్యారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 378 దీనికి సంబంధించి నిబంధనలను కలిగి ఉంది. ఈ కమిషన్‌ ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఐఆర్‌ఎస్‌, ఐఎఫ్‌ఎస్‌ వంటి అఖిల భారత ఉద్యోగాల భర్తీని చేపడుతుంది. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ అనే మూడు దశల్లో సివిల్ సర్వీసెస్ పరీక్షను నిర్వహిస్తుంది. అందుకే ఇవి దేశంలోనే అత్యంత కఠినమైన పరీక్షలుగా చెబుతారు.

Tags:    

Similar News