ITBP Recruitment 2022: నిరుద్యోగులకి బంపర్ ఆఫర్.. ఐటీబీపీలో ఎస్సై ఉద్యోగాలు..!
ITBP Recruitment 2022: ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP) సబ్ ఇన్‌స్పెక్టర్ (SI)పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ITBP Recruitment 2022: ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP) సబ్ ఇన్‌స్పెక్టర్ (SI)పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలనుకునే ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ITBP అధికారిక వెబ్‌సైట్ itbpolice.nic.inని సందర్శించడం ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్టుల కోసం దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. ఈ రిక్రూట్‌మెంట్ కింద మొత్తం 37 పోస్టులు భర్తీ చేస్తారు.
ముఖ్యమైన వివరాలు
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడానికి ప్రారంభ తేదీ - 16 జూలై 2022
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ - 14 ఆగస్టు 2022
ఖాళీల వివరాలు: సబ్ ఇన్స్పెక్టర్ (ఓవర్సీర్) - 37
పురుషులు - 32
UR – 7
SC – 2
ST – 2
OBC – 15
EWS – 3
మహిళలు – 5
UR – 1
SC – 1
OBC – 3
ఈ పోస్టులకి ఎంపికైన అభ్యర్థులకి నెలకి జీతం రూ. 35400 నుంచి 112400 చెల్లిస్తారు. అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన సంస్థ నుంచి 10వ తరగతి ఉత్తీర్ణత, సివిల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా కలిగి ఉండాలి. ఈ పోస్టుల కోసం అభ్యర్థుల వయస్సు పరిమితి 20 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎంపిక ప్రక్రియ ఈ విధంగా ఉంటుంది.
1. ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET)
2. ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (PST)
3. వ్రాత పరీక్ష
4. డాక్యుమెంటేషన్
5. వైద్య పరీక్ష (DME)
6. రివ్యూ మెడికల్ టెస్ట్ (RME)