ITBP Constable Recruitment 2023: నిరుద్యోగులకి అలర్ట్.. ఐటీబీపీ కానిస్టేబుల్ పోస్టులకి అప్లై చేశారా..!
ITBP Constable Recruitment 2023: పోలీస్ ఉద్యోగాల కోసం ఎదురుచూసే నిరుద్యోగ యువతకి ఇది సువర్ణవకాశమని చెప్పాలి.
ITBP Constable Recruitment 2023: పోలీస్ ఉద్యోగాల కోసం ఎదురుచూసే నిరుద్యోగ యువతకి ఇది సువర్ణవకాశమని చెప్పాలి. ఇండో-టిబెటన్ బార్డర్ పోలీస్ (ITBP) 458 కానిస్టేబుల్ డ్రైవర్ పోస్టుల కోసం నోటిఫికేషన్ జారీచేసిన సంగతి తెలిసిందే. జూన్ 27, 2023 నుంచి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. చివరి తేదీ జూలై 26గా నిర్ణయించారు. ఇంకా ఎవరైనా అప్లై చేసుకోని అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ని recruitment.itbpolice.nic.in సందర్శించి అప్లై చేసుకోవచ్చు. చివరి తేదీ ముగిసిన తర్వాత అప్లికేషన్ లింక్ వెబ్‌సైట్ నుంచి తీసివేస్తారు. కాబట్టి వీలైనంత త్వరగా దరఖాస్తు చేసుకోవడం ఉత్తమం. అయితే ఈ పోస్టులకి ఎలా అప్లై చేయాలి.. జీత భత్యాల గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.
అప్లై చేసే విధానం
1. ముందుగా అధికారిక వెబ్‌సైట్ recruitment.itbpolice.nic.inకి వెళ్లాలి.
2. తర్వాత లేటెస్ట్ రిక్రూట్‌మెంట్ లింక్‌పై క్లిక్ చేయాలి.
3. తర్వాత ఐటీబీపీలో జాబ్ ఫర్ కానిస్టేబుల్ లింక్‌పై క్లిక్ చేయాలి.
4. తదుపరి వివరాలు అడిగే ముందు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
5. తర్వాత దరఖాస్తు ఫారమ్‌ను నింపి సబ్‌మిట్ చేయాలి.
6. తర్వాత భవిష్యత్ అవసరాల కోసం ప్రింట్ అవుట్ తీసుకోవాలి.
అర్హతలు, జీత భత్యాలు
ఐటీబీపీ కానిస్టేబుల్ డ్రైవర్ పోస్టులకి ఎంపికైన అభ్యర్థులు పే స్కేల్‌లో (పే మ్యాట్రిక్స్‌లో లెవెల్-3) రూ.21700 నుంచి రూ.69100 వరకు పొందుతారు. దరఖాస్తుదారుల వయస్సు 21 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. గుర్తింపు పొందిన బోర్డు నుంచి మెట్రిక్యులేషన్ లేదా 10వ తరగతి ఉత్తీర్ణులై, డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. జనరల్ కేటగిరీ అభ్యర్థులు రుసుము రూ.100 డిపాజిట్ చేయాలి. ఎస్సీ, ఎస్టీలు ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు. OBC, EWS వర్గాలు కూడా రూ.100 చెల్లించాలి. ఫీజులను ఆన్‌లైన్‌లో మాత్రమే చెల్లించాలని గుర్తుంచుకోండి.