Indian Railway Recruitment 2023: రైల్వేలో లోకో పైలట్,టెక్నీషియన్ ఉద్యోగాలు.. వీరు మాత్రమే అర్హులు..!
Indian Railway Recruitment 2023: సెంట్రల్ రైల్వే 1303 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ కింద జూనియర్ ఇంజనీర్, లోకో పైలట్, గార్డ్/ట్రైన్ మేనేజర్ పోస్టులని భర్తీ చేస్తుంది.
Indian Railway Recruitment 2023: సెంట్రల్ రైల్వే 1303 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ కింద జూనియర్ ఇంజనీర్, లోకో పైలట్, గార్డ్/ట్రైన్ మేనేజర్ పోస్టులని భర్తీ చేస్తుంది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. అధికారిక వెబ్‌సైట్ www.rrccr.comకి వెళ్లి అప్లై చేసుకోవాలి. ఈ పోస్టులకి అప్లై చేసుకోవడానికి చివరి తేదీ 2 సెప్టెంబర్ 2023గా నిర్ణయించారు.
ఖాళీల వివరాలు
ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ కింద సెంట్రల్ రైల్వేలో మొత్తం 1303 ఖాళీలు ఉన్నాయి. సమాచారం ప్రకారం ఈ నియామకాలు GDCE (General Departmental Competitive Exam) కోటా కింద జరుగుతున్నాయి. ఈ మొత్తం పోస్టుల్లో అసిస్టెంట్ లోకో పైలట్ 732, టెక్నీషియన్ 255, జూనియర్ ఇంజనీర్ 234, గార్డ్/ట్రైన్ మేనేజర్ 82 పోస్టులు ఉన్నాయి.
అర్హతలు
దరఖాస్తు చేసుకునే అభ్యర్థి 1 ఆగస్టు 2023 నాటికి సెంట్రల్ రైల్వేలో రెగ్యులర్ ఉద్యోగి అయి ఉండాలి. ఇది కాకుండా ఆగస్ట్ 1, 2021లోపు లేదా అంతకు ముందు రైల్వేలో నియమితులై ఉండాలి. ఈ రిక్రూట్‌మెంట్‌కు దరఖాస్తు చేసుకునే జనరల్ కేటగిరీ అభ్యర్థుల వయస్సు 42 సంవత్సరాలు, OBC కేటగిరీ అభ్యర్థులకు 45 సంవత్సరాలు, SC/ST కేటగిరీ అభ్యర్థులకు గరిష్టంగా 47 సంవత్సరాలు ఉండాలి.
ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్
అసిస్టెంట్ లోకో పైలట్ - ట్రేడ్‌లలో NCVT/SCVT గుర్తింపు పొందిన సంస్థల నుంచి మెట్రిక్యులేషన్/SSLC ప్లస్ ITI లేదా ఇంజనీరింగ్ విభాగాల్లో వివిధ ట్రేడ్‌లలో 3 సంవత్సరాల డిప్లొమా ఉండాలి.
టెక్నీషియన్ పోస్టులు:- NCVT/ SCVT గుర్తింపు పొందిన సంస్థల నుంచి మెట్రిక్యులేషన్/ SSLC మరియు ITI ఉత్తీర్ణులై ఉండాలి.
JE పోస్టులు - గుర్తింపు పొందిన ఇన్‌స్టిట్యూట్ నుంచి బేసిక్ స్ట్రీమ్, ఏదైనా సబ్ స్ట్రీమ్ కాంబినేషన్‌లో మూడేళ్ల డిప్లొమా తప్పనిసరిగా ఉండాలి.