India Post Jobs 2023: పోస్టాఫీసు ఉద్యోగాలు.. పది పాసైతే చాలు ఎటువంటి రాత పరీక్ష ఉండదు..!
India Post Jobs 2023: పదో తరగతి చదివిన నిరుద్యోగులకి ఇది శుభవార్తని చెప్పాలి.
India Post Jobs 2023: పదో తరగతి చదివిన నిరుద్యోగులకి ఇది శుభవార్తని చెప్పాలి. ఇండియా పోస్ట్ నుంచి మరో బంపర్ నోటిఫికేషన్ విడుదలైంది. పోస్ట్ ఆఫీస్‌లో గ్రామీణ డాక్ సేవక్స్ (GDS), బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (BPM), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (ABPM) ఉద్యోగాల భర్తీ చేపడుతోంది. ఇప్పటికే ఆన్‌లైన్ ప్రక్రియ కూడా ప్రారంభమైంది. ఈ ఉద్యోగాలకి అప్లై చేయాలనే నిరుద్యోగులు అధికారిక వెబ్‌సైట్indiapostgdsonline.gov.in సందర్శించి అప్లై చేసుకోవచ్చు.
ముఖ్యమైన తేదీలు
ఇండియా పోస్ట్ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు ప్రక్రియ మే 22 నుంచి ప్రారంభమైంది.
అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి జూన్ 11, 2023 వరకు సమయం ఉంది. జూన్ 12 నుంచి జూన్ 14, 2023 వరకు దరఖాస్తు ఫారమ్‌లో సవరణలు చేయడానికి అవకాశం ఉంటుంది.
వయోపరిమితి
ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవడానికి అభ్యర్థుల వయోపరిమితి 18 నుంచి 40 సంవత్సరాలు ఉండాలి. రిజర్వ్‌డ్ కేటగిరీకి నిబంధనల ప్రకారం గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
విద్యార్హత
తప్పనిసరిగా గుర్తింపు పొందిన బోర్డు నుంచి గణితం, ఆంగ్లం సబ్జెక్ట్‌లుగా చదివి 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. దీంతో పాటు అభ్యర్థులకు కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి.
పే స్కేల్
బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (BPM) పోస్టులలో ఎంపికైన అభ్యర్థులు నెలకు రూ. 12,000 నుంచి 29,380 వరకు జీతం పొందుతారు. అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (ABPM) పోస్టుకు ఎంపికైన అభ్యర్థులు రూ. 10,000 నుంచి 24,470 వరకు జీతం పొందుతారు.
ఈ విధంగా అప్లై చేయండి..
1. మొదట అధికారిక వెబ్‌సైట్indiapostgdsonline.gov.inని సందర్శించండి.
2. రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ లింక్‌పై క్లిక్ చేయండి.
3. దరఖాస్తు ఫారమ్‌ను పూరించడానికి కొనసాగండి.
4. రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయండి. అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయండి.
5. దరఖాస్తు ఫారమ్‌లోని వివరాలను ధృవీకరించండి.
6. నిర్ణీత దరఖాస్తు రుసుమును చెల్లించండి.
7. ఆ తర్వాత దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించండి.
8. ఫారమ్ ప్రింటవుట్‌ని తీసి మీ వద్ద ఉంచుకోండి.