Law Study: లాయర్‌, జడ్జి మాత్రమే కాదు.. లా చదివితే బోలెడు అవకాశాలు..!

Law Study: ఇంటర్‌ అయిపోయిన విద్యార్థులు గందరోగోళ పరిస్థితుల్లో ఉంటారు. ఎలాంటి కెరియర్‌ ఎంచుకోవాలో తెలియక అయోమయంలో కొట్టుమిట్టాడుతుంటారు.

Update: 2023-07-30 14:30 GMT

Law Study: లాయర్‌, జడ్జి మాత్రమే కాదు.. లా చదివితే బోలెడు అవకాశాలు..!

Law Study: ఇంటర్‌ అయిపోయిన విద్యార్థులు గందరోగోళ పరిస్థితుల్లో ఉంటారు. ఎలాంటి కెరియర్‌ ఎంచుకోవాలో తెలియక అయోమయంలో కొట్టుమిట్టాడుతుంటారు. కెరియర్‌ ఎంచుకోవడానికి వీరికి చాలా అవకాశాలు ఉంటాయి. కానీ అందులో ఏది బెస్ట్‌ అనేది ఎంపిక చేసుకోలేకపోతారు. వాస్తవానికి వారికి ఉండే నైపుణ్యాలని బట్టి కెరియర్‌ ఎంచుకుంటే జీవితంలో విజయం సాధిస్తారు. అయితే ఇంటర్ అయిపోయాక న్యాయ విద్య అభ్యసిస్తే మంచి అవకాశాలు ఉంటాయని చెప్పవచ్చు. కానీ దీని గురించి చాలామంది విద్యార్థులకి తెలియదు. లా చదవడం వల్ల ఎలాంటి అవకాశాలు ఉంటాయో ఈరోజు తెలుసుకుందాం.

కాలం మారుతున్న కొద్ది కొత్త కొత్త చట్టాలు వస్తున్నాయి. దీనివల్ల న్యాయ నిపుణులకు చాలా డిమాండ్ పెరిగింది. ఒకప్పుడు లా చదివితే లాయర్‌ లేదా జడ్జి మాత్రమే అవుతారని అనుకునేవారు కానీ ఇప్పుడు ట్రెండ్‌ మారింది. ప్రతి విభాగంలో న్యాయ నిపుణుల అవసరం పెరిగింది. దీంతో లా చదివిన వారు మంచి ఉద్యోగాలలో స్థిరపడుతున్నారు. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్, లాజికల్ అనాలిసిస్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉంటే లా రంగంలో కెరీర్ చేయవచ్చు. చట్టాన్ని అధ్యయనం చేయడం వల్ల ఇతర రంగాల్లో తనదైన ముద్ర వేయవచ్చు.

ఇంటర్‌ తర్వాత ఐదేళ్ల ఎల్‌ఎల్‌బి చేయడం వల్ల న్యాయవాద వృత్తిని పొందవచ్చు. అలాగే గ్రాడ్యుయేషన్ తర్వాత BA LLB, BSc LLB, BCom LLB, BCA LLB, BBA LLB వంటి కోర్సులు చేయవచ్చు. LLB చేయడం వల్ల చాలామంది న్యాయవాద వృత్తిని ఎంచుకుంటారు. అయితే కోర్టులో ప్రాక్టీస్ చేసే ముందు ఆల్ ఇండియా బార్ ఎగ్జామ్ పాసవ్వాలి. తర్వాత మాత్రమే బార్ కౌన్సిల్‌లో మీ రిజిస్ట్రేషన్ జరుగుతుంది. ఒకవేళ లా టీచింగ్ రంగంలో కెరీర్ చేయాలనుకుంటే LLB తర్వాత LLM చేయాలి. దీంతో ఏదైనా లా కాలేజీలో లెక్చరర్‌గా కెరీర్‌ను కొనసాగించవచ్చు.

నేటి రోజుల్లో ఆన్‌లైన్ మోసం, మొబైల్ క్లోనింగ్, సోషల్ మీడియా ఖాతా హ్యాకింగ్ వంటి అనేక సైబర్ నేరాలు వేగంగా పెరిగాయి. ఇలాంటి కేసుల్లో వాదించే సైబర్ లాయర్లకు డిమాండ్ పెరుగుతోంది. అలాగే కాపీరైట్, పేటెంట్ గురించి పరిజ్ఞానం ఉన్నవారికి పేటెంట్ & కాపీరైట్ లాయర్లుగా అవకాశాలు లభిస్తున్నాయి. ఈ రోజుల్లో కార్పొరేట్ లాలో కూడా మంచి కెరీర్ ఉంది. కంపెనీలు లా నిపుణులను నియమించుకుంటున్నాయి. సంస్థ చట్టపరమైన ఆస్తులు, హక్కులు రక్షించడంలో వీరి పాత్ర ఉంటుంది.

Tags:    

Similar News