Pet Grooming Career: జంతువులంటే ఇష్టముంటే పెట్ గ్రూమింగ్‌ చేయొచ్చు.. ఇది ఎలా ఉంటుందంటే..?

Pet Grooming Career: కొంతమందికి జంతువులంటే చాలా ఇష్టం ఉంటుంది. వాటి హావాభావాలని అర్థం చేసుకొని ఆనందిస్తారు.

Update: 2023-07-26 13:31 GMT

Pet Grooming Career: జంతువులంటే ఇష్టముంటే పెట్ గ్రూమింగ్‌ చేయొచ్చు.. ఇది ఎలా ఉంటుందంటే..?

Pet Grooming Career: కొంతమందికి జంతువులంటే చాలా ఇష్టం ఉంటుంది. వాటి హావాభావాలని అర్థం చేసుకొని ఆనందిస్తారు. వాటితో ఎక్కువ సమయం గడపటానికి ఇష్టపడుతారు. వాటికి చిన్న గాయం అయినా తట్టుకోలేరు. వాటిని జాగ్రత్తగా చూసుకోవడం, శుభ్రత పట్ల శ్రద్ధ వహించడం చేస్తారు. మీకు కూడా జంతువుల పట్ల ఇలాంటి ప్రేమ ఉంటే దీనినే కెరియర్‌ చేసుకోవచ్చు. వాటి జుట్టు కత్తిరించడం, తలస్నానం చేయడం, చెవులు శుభ్రం చేయడం, గోళ్లు కత్తిరించడం వంటివి చేసే ఒక సెలూన్‌ ఏర్పాటు చేసుకోవచ్చు. మంచి ఆదాయం సంపాదించవచ్చు. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.

పెట్ గ్రూమింగ్ ఎక్కడ చదవాలి..?

పెట్ గ్రూమింగ్ రంగంలోకి ప్రవేశించడానికి పెద్ద చదువులు అవసరం లేదు. కానీ ఒక కోర్సు చేసి శిక్షణ తీసుకుంటే ఖచ్చితంగా ఈ రంగంలోకి ప్రవేశించవచ్చు. పెట్ గ్రూమింగ్‌లో అనేక సర్టిఫికేట్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఇవి 2 నుంచి మూడు, 6 నెలల వరకు ఉంటాయి. చాలా ఇన్‌స్టిట్యూట్‌లు ఈ కోర్సును అందిస్తున్నాయి. ఇది కాకుండా ఆన్‌లైన్ సర్టిఫికేట్ కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి. నేటి కాలంలో అనేక ప్రైవేట్ సంస్థలు ఈ రంగంలో పనిచేస్తున్నాయి.

ప్రాక్టికల్ నాలెడ్జ్ ముఖ్యం

ఈ రంగంలో ప్రవేశించి విజయం సాధించాలంటే ఆచరణాత్మక పరిజ్ఞానం చాలా ముఖ్యం. పెట్ గ్రూమింగ్ సెలూన్‌లో కొన్ని రోజులు పనిచేసి అనుభవం సంపాదించుకుంటే బాగుంటుంది. జంతువులను ఎలా హ్యాండిల్ చేయాలో వాటికి అందమైన రూపాన్ని ఎలా ఇవ్వాలో తెలుస్తుంది. క్లయింట్ ఏం కోరుకుంటున్నారో తెలిస్తే మంచి ఆదాయం సంపాదించవచ్చు. మీకు ఎంత ఎక్కువ అనుభవం ఉంటే అంత పెద్దగా సంపాదన ఉంటుంది.

సొంత సెలూన్ తెరవవచ్చు

మీకు పూర్తి నాలెడ్జ్‌, అనుభవం తర్వాత సొంత సెలూన్‌ని ఓపెన్‌ చేయవచ్చు. పెద్ద పెద్ద నగరాల్లో వీటికి చాలా డిమాండ్ ఉంటుంది. ఈ రోజుల్లో చిన్న పట్టణాల్లో కూడా ప్రజలు ఈ సౌకర్యాలను ఉపయోగించుకోవడం ప్రారంభించారు. ఈ రంగంలో సంపాదన అనేది మీరు ఎక్కడ పని చేస్తారు, మీ అనుభవంపై ఆధారపడి ఉంటుంది. అయితే ప్రారంభంలో సుమారుగా 20 నుంచి 35 వేల రూపాయల వరకు సంపాదించవచ్చు.

Tags:    

Similar News