ఇంజనీరింగ్ విద్యార్థులకి అలర్ట్.. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్లో ఉద్యోగాలు..!
ఇంజనీరింగ్ విద్యార్థులకి అలర్ట్.. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్లో ఉద్యోగాలు..!
BPCL Recruitment 2022: భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, కొచ్చి (BPCL) రిఫైనరీ వివిధ ట్రేడ్లలో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలనుకునే ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు BPCL అధికారిక వెబ్సైట్ bharatpetroleum.inని సందర్శించడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా మొత్తం 102 పోస్టులు భర్తీ చేస్తారు. దరఖాస్తు చేయడానికి చివరి తేదీ 13 సెప్టెంబర్ 2022గా నిర్ణయించారు.
1.గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ - 102
2.కెమికల్ ఇంజనీరింగ్ - 31
3.సివిల్ ఇంజనీరింగ్ - 08
4.కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్ - 09
5.ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ / ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ - 05
6.సేఫ్టీ ఇంజనీరింగ్ / సేఫ్టీ అండ్ ఫైర్ ఇంజనీరింగ్ - 10
7.మెకానికల్ ఇంజనీరింగ్ - 28
8.ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ / అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ /
ఇన్స్ట్రుమెంటేషన్ & కంట్రోల్ ఇంజనీరింగ్/ఎలక్ట్రానిక్స్ & ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్-09
మెటలర్జికల్ ఇంజనీరింగ్-02
అర్హత ప్రమాణాలు
అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన సంస్థ నుంచి 60% మార్కులతో సంబంధిత సబ్జెక్టులలో ఇంజనీరింగ్ డిగ్రీని కలిగి ఉండాలి. అభ్యర్థుల వయోపరిమితి 18 ఏళ్ల నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి.