నిరుద్యోగులకి శుభవార్త.. పది, పన్నెండు అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..!
Assam Rifles Recruitment 2022: రక్షణ దళాల్లో పనిచేయాలనే ఆసక్తి ఉన్న అభ్యర్థులకి బంపర్ ఆఫర్ వచ్చింది.
Assam Rifles Recruitment 2022: రక్షణ దళాల్లో పనిచేయాలనే ఆసక్తి ఉన్న అభ్యర్థులకి బంపర్ ఆఫర్ వచ్చింది. అస్సాం రైఫిల్ నుంచి పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో హవల్దార్, రైఫిల్‌మ్యాన్, వారెంట్ ఆఫీసర్, నాయబ్ సుబేదార్ వంటి పలు (ట్రేడ్స్‌మెన్) పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఈ ఉద్యోగాల గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.
మొత్తం పోస్టులు 1380
1. బ్రిడ్జి, రోడ్ అసిస్టెంట్ పోస్టులు: 17
2. క్లర్క్ పోస్టులు: 287
3. టీచర్ పోస్టులు: 9
4. ఆపరేటర్ రేడియో, మెకానిక్ పోస్టులు: 729
5. రేడియో మెకానిక్ పోస్టులు: 72
6. వెపన్స్ అసిస్టెంట్ పోస్టులు: 48
7. ల్యాబ్ అసిస్టెంట్ పోస్టులు: 13
8. నర్సింగ్ అసిస్టెంట్ పోస్టులు: 100
9. వెటర్నరీలో ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులు:10
10. హెల్పర్ (పారా మెడికల్) పోస్టులు:15
11. వాషర్మన్ పోస్టులు: 80
అభ్యర్ధుల వయసు 18 నుంచి 23 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపికైన అభ్యర్థులకి నెలకు రూ. 18,000ల నుంచి 29,200ల వరకు జీతంగా చెల్లిస్తారు. పోస్టునుబట్టి పదో తరగతి /ఇంటర్/గ్రాడ్యుయేషన్ డిగ్రీ/డిప్లొమా లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. నోటిఫికేషన్లో సూచించిన విధంగా శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి. ఫిజికల్ క్వాలిటీ టెస్ట్, ఫిజికల్ ప్రొఫిషియన్సీ టెస్ట్, రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, మెడికల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ఆసక్తి కలిగిన అభ్యర్దులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. జనరల్, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.100, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది. దరఖాస్తులకు చివరి తేదీ జూలై 20, 2022గా నిర్ణయించారు.