Agniveer Bharti 2023: శిక్షణలో గాయపడితే ఇంటికే.. సైన్యం కఠిన నిబంధనలు..!

Agniveer Bharti 2023: సైన్యంలోని మూడు విభాగాల్లో అగ్నివీర్‌ను నియమిస్తున్నారు. కానీ ఎంపికైన కొంతమంది అభ్యర్థులు శిక్షణ సమయంలోనే బయటకు వస్తున్నారు. దీనికి కారణం అగ్నిపథ్‌ నియమాలు కఠినంగా ఉండటమే.

Update: 2023-07-12 09:06 GMT

Agniveer Bharti 2023: శిక్షణలో గాయపడితే ఇంటికే.. సైన్యం కఠిన నిబంధనలు..!

Agniveer Bharti 2023: కేంద్ర ప్రభుత్వం రక్షణ శాఖలో నాలుగు సంవత్సరాల పాటు పనిచేసేందుకు సైనికుల నియామక ప్రక్రియ కోసం అగ్నిపథ్ పథకాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. గత సంవత్సరం నుంచి రిక్రూట్‌మెంట్ ప్రక్రియ చేపట్టింది. ఈ ఏడాది కూడా ఈ పథకం కింద యువతను రిక్రూట్ చేస్తున్నారు. సైన్యంలోని మూడు విభాగాల్లో అగ్నివీర్‌ను నియమిస్తున్నారు. కానీ ఎంపికైన కొంతమంది అభ్యర్థులు శిక్షణ సమయంలోనే బయటకు వస్తున్నారు. దీనికి కారణం అగ్నిపథ్‌ నియమాలు కఠినంగా ఉండటమే.

వాస్తవానికి శిక్షణ సమయంలో గాయాలు కావడంతో సైన్యం యువతను బహిష్కరిస్తోంది. అగ్నివీర్ రిక్రూట్‌మెంట్‌లో ఎవరైనా 6 నెలల శిక్షణలో 30 రోజులు నిరంతరాయంగా సెలవులో ఉంటే అతన్ని బయటకు పంపుతున్నారు. అంటే అతన్ని రిక్రూట్‌మెంట్ చేయకూడదని నిబంధన ఉంది. నివేదికల ప్రకారం ప్రతి శిక్షణా కేంద్రం నుంచి ఇటువంటి కేసులు వస్తున్నాయని ఒక సైనిక ఉన్నతాధికారి తెలిపారు. మీడియా కథనాల ప్రకారం నిబంధనలను మార్చే ఆలోచనలో సైన్యం ఉంది. కానీ ఇది వెంటనే జరగదు. ఇంకా పరిశీలనలోనే ఉంది కాబట్టి ఇది జరగడానికి చాలా సమయం పడుతుందని తెలుస్తోంది. ఈలోగా ఇంకొంతమంది అభ్యర్థులు బయటికి వచ్చే అవకాశాలు ఉన్నాయి.

రెగ్యులర్ రిక్రూట్‌మెంట్‌ నియమాలు

అగ్నిపథ్‌ కాకుండా ఆర్మీ రెగ్యులర్ రిక్రూట్‌మెంట్‌లో అయితే శిక్షణ సమయంలో ఎవరైనా గాయపడినట్లయితే అతన్ని తిరిగి బ్యాచ్‌లో ఉంచాలనే నిబంధన ఉంది. కానీ అతడికి పూర్తి శిక్షణ పూర్తయ్యాక అపాయింట్‌మెంట్ ఇస్తారు. రెగ్యులర్ రిక్రూట్‌మెంట్‌లో శిక్షణ 9 నుంచి 11 నెలల వరకు ఉంటుంది. కానీ అగ్నివీర్ రిక్రూట్‌మెంట్‌లో ఇలాంటి నియమం లేదు. కాబట్టి శిక్షణ సమయంలో గాయం కారణంగా చాలామంది ఆర్మీలో ఉద్యోగాలని కోల్పోతున్నారు.

Tags:    

Similar News