Railway Job 2023: రైల్వే జాబ్‌కి ప్రిపేర్ అవుతున్నారా.. ఈ విషయాలు మరిచిపోవద్దు..!
Railway Job 2023: ప్రతి సంవత్సరం రైల్వేశాఖ నుంచి నోటిఫికేషన్లు వస్తూనే ఉంటాయి. చాలామంది నిరుద్యోగులకి రైల్వేలో ఉద్యోగం సాధించాలని ఉంటుంది. కానీ అందరు విజయం సాధించలేరు.
Railway Job 2023: ప్రతి సంవత్సరం రైల్వేశాఖ నుంచి నోటిఫికేషన్లు వస్తూనే ఉంటాయి. చాలామంది నిరుద్యోగులకి రైల్వేలో ఉద్యోగం సాధించాలని ఉంటుంది. కానీ అందరు విజయం సాధించలేరు. పోటీ పరీక్షలకి ప్రిపేర్ అయ్యేటప్పుడు కచ్చితంగా కొన్ని విషయాలని గుర్తుంచుకోవాలి. అప్పుడే విజయవకాశాలు మెరుగవుతాయి. లక్షల మంది పోటీదారులని ఎదుర్కొని జాబ్ ఎలా సాధించాలనేది ఈరోజు తెలుసుకుందాం.
సిలబస్‌పై పట్టు
మొదటగా మీరు దరఖాస్తు చేస్తున్న పోస్ట్‌కు సిలబస్ ఏంటి అనేది అర్థం చేసుకోవాలి. ప్రిపరేషన్ స్ట్రాటజీని రూపొందించేటప్పుడు ఈ విషయంపై దృష్టి సారించాలి. అప్పుడే విజయవకాశాలు పెరుగుతాయి. కష్టంగా అనిపించే సబ్జెక్టులు లేదా అంశాలపై ఎక్కువ ఫోకస్ చేయండి.
పేపర్ నమూనా
సిలబస్‌ను అర్థం చేసుకున్న తర్వాత పేపర్ నమూనాను అర్థం చేసుకోవాలి. ఎక్కువ ప్రశ్నలు ఏ విభాగం నుంచి వస్తున్నాయో గమనించాలి. దీనివల్ల పరీక్షలో ఎక్కువ మార్కులు సాధించే అవకాశాలు ఉంటాయి. ప్రిపరేషన్ వ్యూహంలో భాగంగా ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి.
ప్రిపరేషన్ వ్యూహం
సిలబస్, పేపర్ నమూనాను అర్థం చేసుకున్న తర్వాత ప్రిపరేషన్ వ్యూహాన్ని ప్రారంభించాలి. టైమ్ టేబుల్‌ని ఖచ్చితంగా పాటించాలి. పరీక్షకు 20 నుంచి 25 రోజుల ముందు ప్రిపరేషన్ పూర్తవుతుంది తర్వాత రివిజన్ కోసం తగినంత సమయం కేటాయించాలి.
ఆర్‌ఆర్‌బి పుస్తకాలు చదవండి
రైల్వే పరీక్షల కోసం ప్రత్యేకంగా రూపొందించే ఆర్‌ఆర్‌బి పుస్తకాలు ఉంటాయి. సిలబస్ పూర్తి చేయడం కష్టంగా ఉంటే ఈ పుస్తకాలు తీసుకొని చదవండి. పూర్తిగా కాకున్నా దాదాపు మొత్తం సిలబస్ కవర్ అవుతుంది.