నారీ నారీ నడుమలో,
నారాయణ డబ్బులు,
అక్కడ ఇస్తాడేమో అని,
ఆవిడే ఇక్కడే దోచేసిందట. శ్రీ.కో
అతడికి ఇద్దరు భార్యలు. రెండో భార్యకే భర్త ఆస్తులు కూడబెడుతున్నాడని మొదటి భార్య అసూయపడేది. తీవ్ర అభద్రతాభావానికి లోనైంది. చివరకు ఇంట్లోనే ఆమె భారీ చోరీ చేసింది. ఈ మిస్టరీ కేసును పోలీసులు చేధించారు. హైదరాబాద్ సరూర్ నగర్ కు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి నారాయణకు ఇద్దరు భార్యలు. మొదటి భార్య పేరు సుధ. రెండో భార్యకే భర్త ఆస్తులు కుడబెడుతున్నాడని సుధ మధనపడేది. ఇటీవల వెంకటేష్ యాదవ్ అనే వ్యక్తి సాయంతో నారాయణ ఇల్లు కొనుగోలుకు ప్రయత్నం చేస్తున్నాడు. 41 లక్షల రూపాయలను ఇంట్లో తెచ్చి పెట్టాడు. భర్త ఇంట్లోలేని సమయంలో మొదటి భార్య 41 లక్షల రూపాయలను కొట్టేసింది.