సుధాకర్ రెడ్డిని ఇలా హత్య చేశాం : రాజేష్

Update: 2017-12-15 17:46 GMT

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సుధాకర్ రెడ్డి హత్య కేసులో.. నిందితుడు రాజేష్‌ను నాగర్‌కర్నూలు పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టారు. క్రైమ్ థ్రిల్లర్ మూవీని తలపించిన ఈ మర్డర్ కేసుకు సంబంధించి పోలీసులు పలు కీలక సమాచారాన్ని సేకరించారు. సుధాకర్ రెడ్డిని హత్యచేసిన ప్రాంతానికి రాజేష్‌ను తీసుకెళ్లారు. నవాబుపేట మండలం ఫతేపూర్ అడవుల్లో మర్డర్ కు  స్వాతితో కలిసి వేసిన స్కెచ్ ను పోలీసులకు వివరించాడు. సుధాకర్ రెడ్డి మృతదేహాన్ని తగలబెట్టిన విధానాన్ని.. సంఘటనా ప్రాంతంలోనే కళ్లకు కట్టినట్లు పోలీసులకు చూపించాడు రాజేష్.

సుధాకర్ రెడ్డి మర్డర్ ప్లాన్ స్వాతిదేనని చెప్పిన రాజేష్. సుధాకర్ రెడ్డి పొడుకునప్పుడు స్వాతితో కలిసి అతన్ని చంపాని తెలిపాడు.  స్వాతి దిండుతో నొక్కిపట్టుకోగా, తాను ఇనుపరాడ్ తో కొట్టి చంపామని చెప్పాడు. తర్వాత కారులో మృతదేహన్ని ఫతేపూర్ అడవుల్లో తగలపెట్టామన్నాడు. ఇంటికి వచ్చాక యాసిడ్ దాడి జరిగిందంటూ డ్రామా ఆడామని చెప్పాడు. ప్లాస్టిక్‌ సర్జరీ చేయించుకుని తన భర్తలా చలామణి కావాలని స్వాతినే కోరిందన్నాడు రాజేష్. సర్జరీకి కావాల్సిన డబ్బులును కూడా స్వాతినే సమకూర్చుతానందని పోలీసుల విచారలో తెలిపాడు. తన పిల్లలను వదిలి రానందుకే సుధాకర్‌రెడ్డిని హత్య చేయాల్సి వచ్చిందన్నాడు. వైవాహిక జీవితం సరిగాలేదని స్వాతి తనతో చెప్పేదని, కొన్నాళ్లకే ఇద్దరం దగ్గరయ్యామన్నాడు. సుధాకర్‌రెడ్డి లేనప్పుడు వాళ్లింట్లోనే కలుసుకునేవాళ్లమని తెలిపాడు. 

Similar News