సుఖదుఃఖాలు,జగత్ కిలాడీలు నిర్మించి,
ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్యను పెంచి,
చదువు సంస్కారం, అంతులేని కథను పంచి,
తన జీవితాన్ని సినిమాకె అంకితం ఇచ్చిన రాఘవగారు,
తన జీవితానికి ఫైనల్ "పాకప్" చెప్పారు. శ్రీ కో
ప్రముఖ నిర్మాత, ప్రతాప్ ఆర్ట్స్ అధినేత కె. రాఘవ గుండెపోటుతో మృతిచెందారు. అనారోగ్యంతో జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో చేరిన ఆయన ఈ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఆయన వయస్సు 105 ఏళ్లు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ సమీపంలోని కోటిపల్లి అనే గ్రామంలో 1913లో ఆయన జన్మించారు. రాఘవ అనేక చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు. సుఖదుఃఖాలు, జగత్ కిలాడీలు, తాత మనవడు, ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య, చదువు సంస్కారం, అంతులేని వింతకథ, అంకితం, ఈ ప్రశ్నకు బదులేదీ వంటి అనేక చిత్రాలను నిర్మించడంతో పాటు బాలనాగమ్మ, చంద్రలేఖ వంటి చిత్రాల్లో ఆయన నటించారు.