అమెరికా అధ్యక్షుడు అయిన ఆడవారి విషయంలో

Update: 2018-08-23 07:38 GMT

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు గత జ్ఞాపకాలు,

వెంటాడి, తన ఒకప్పటి లాయరు మైఖేల్‌ కోహెన్‌,

రూపంలోఒక షాక్‌ తగిలింది, ఇద్దరు మహిళలు,

నోరు మూసాడని కోర్టు అతనిని దోషిగా తేల్చింది,

పాపం ట్రంప్ పాత తీపి జ్ఞాపకాలు ఇప్పుడు చేదుగ మారాయి. శ్రీ.కో. 


అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు గత జ్ఞాపకాలు వెంటాడి ఒక షాక్‌ తగిలింది. ట్రంప్‌ వద్ద పర్సనల్‌ లాయర్‌గా పనిచేసిన మైఖేల్‌ కోహెన్‌ను మన్‌హట్టన్‌లోని ఫెడరల్‌ కోర్టు దోషిగా తేల్చింది. 2016 ఎన్నికల సమయంలో కోహెన్‌ ఇద్దరు మహిళలకు కొంత  డబ్బుని  ఆశ జూపి వారిని ఎట్టి పరిస్తితుల్లోఎన్నికల్లో ట్రంప్‌కు వ్యతిరేకంగా పని చేయకుండా చేశారని తెలిపింది. తనతో ప్రత్యేకమైన వ్యక్తిగత సంబంధాలున్న ఇద్దరు మహిళల వ్యతిరేక ప్రచారాన్ని ట్రంప్‌ ఉద్దేశపూర్వకంగా అడ్డుకోవడానికి కోహెన్‌ ఇందంతా చేసి పెట్టాడని కోర్టు వెల్లడించింది. కోహెన్‌ తరపు లాయర్‌ లానీ దావిస్‌ మాత్రం కోహెన్‌ జస్ట్ ట్రంప్‌ ఎన్నికల ప్రచారం కోసం మాత్రమే పనిచేశాడని చెప్తున్నారు. 

Similar News