అరవింద సమేతా లో త్రివిక్రమ్ పెన్ను నుండి దూసుకుంటూ వచ్చిన మాటల తూటాలు కొన్ని….
యుద్ధం చేసే సత్తా లేని వాడికి.. శాంతి గురించి మాట్లాడే అర్హత లేదు.
‘కంటపడితే కనికరిస్తానేమో.. ఎంటపడ్డానా నరికేస్తా’
30 ఏండ్ల నాడు మీ తాత కత్తి పట్టినాడంతే అది అవసరం.. అదే కత్తి మీ నాయన ఎత్తినాడంటే అది వారసత్వం.. 10 దినాల నాడు అదే కత్తి నువ్ దూసినావంటే.. అది లక్షణం. ఆ కత్తి నీ బిడ్డనాటికి లోపమైతుందా.
వీరా.. నువ్ కత్తి పట్టినట్టు లేదురా.. అది నీ చేతికి మొలిచినట్టు ఉందిరా..
‘వాడిదైన రోజున ఎవడైనా కొట్టగలడు. అసలు గొడవ రాకుండా ఆపుతాడు చూడు.. వాడు గొప్పోడు’
వయెలెన్స్ మా డీఎన్ఏ కాదు.. మీ మీద వచ్చిపడ్డ అత్యవసర పరిస్థితి.
వీరా! నిన్ను వేలిపట్టి నడిపించాడు.. నువ్ ఇప్పుడు కాటికి నడిపీయాలా
‘కొండను చూసి కుక్క మొరిగితే కొండకి చేటా? తగ్గితే తప్పేంటి?
నల్లమబ్బు ఆకాశాన్ని కమ్మినట్టు నల్లగుడిని కమ్మేస్తా.. ఊరిచేరేలోపు తరుముకుంటా వచ్చి చంపేస్తా..
మాట్లాడితే మా వాళ్లే కాదు.. శత్రువులు కూడా వింటారు.
‘వందడుగుల్లో నీరు పడుతుందంటే 99 అడుగుల వరకు తవ్వి ఆపేసేవాడిని ఏమంటారు. మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను. ఈ ఒక్క అడుగు వందడుగులుతో సమానం సార్ తవ్వి చూడండి’