సమ్మెతో ప్రయాణికులకు ఇబ్బందులు కమ్మే

Update: 2018-08-08 07:19 GMT

చట్టసవరణను ఉపసంహరించుకోమ్మని,

నిన్న అన్ని జిల్లాలో చేపట్టిన ఆర్టీసీ సమ్మె,

పలు సంస్థల పాటించిన దేశవ్యాప్త సమ్మె,

చేసినావరందరు విజయవంతమని నమ్మే, 

కానీ ప్రయాణికులకి ఎన్నో ఇబ్బందులు కమ్మే. శ్రీ.కో


మోటర్‌ వైకిల్‌ చట్టం 2017ను కేంద్ర ప్రభుత్వం సవరణ చేయడాన్ని నిరసిస్తూ మంగళవారం జిల్లాలో చేపట్టిన ఆర్టీసీ సమ్మె విజయవంతం అయ్యింది. ఆర్టీసీతో పాటు పలు సంస్థలు దేశవ్యాప్త సమ్మెకు పిలుపునివ్వడంతో రీజియన్‌లో దాదాపు 920 బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి. సమ్మెతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఒక్క బస్సు కూడా డిపో నుంచి బయటికి రాలేదు. టీఎంయూ, ఈయూ, టీఎన్‌ఎంయూ, ఎస్‌డబ్ల్యూఎఫ్‌ తదితర సంఘాల నాయకులు కేంద్ర ప్రభుత్వం తీరు పట్ల నిరసన వ్యక్తం చేశారు. ఎంవీ చటాన్ని సవరించడం వల్ల ఆర్టీసీ నిర్వీర్యం అయ్యే ప్రమాదం ఉందని టీఎంయూ నేత జీఎల్‌గౌడ్‌ అన్నారు. చట్ట సవరణను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. ఎల్‌డబ్ల్యూఎఫ్‌ నాయకులు వీరాంజనేయులు ప్రసంగిస్తూ కేంద్రం ఆర్టీసీని నీరు గార్చేందుకే సవరణలు చేపట్టిందని అన్నారు. ఈ సవరణ వల్ల ఉద్యోగులు రోడ్డుపైకి వస్తారని, డ్రైవర్లు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పారు. ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఆర్టీసీని కాపాపడాల్సిన అవసరం ప్రభుత్వానిదేనని చెప్పారు. చట్ట సవ రణను ఉపసంహ రించుకోవాల్సిందేనని కార్మిక సంఘం నాయకులు, టీఎంయూ నేత జీఎల్‌గౌడ్‌, డీఎస్‌ చారి డిమాండ్‌ చేశారు.
 

Similar News