ఆధార్ "కి" భద్రమైన సేవలు,
అంటిరి కదా శర్మ గారు,
కాని కొందరు హకర్లు మాత్రం,
'ఇగో", ఇన్ని దొంగ తోవలు,
అని చూపేను కదా సారు గారు. శ్రీ.కో
ఆధార్ నెంబర్ తెలిస్తే మాత్రం వ్యక్తిగత వివరాలు తెలుసుకోలేమని, ఎవరూ దాన్ని దుర్వినియోగం చేయలేరని టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్ ఆర్.ఎస్.శర్మ గట్టిగా వాదించారు. తన 12 అంకెల ఆధార్ నెంబర్లు బయటపెట్టారు. తన డేటా చౌర్యం చేయాలని సవాల్ విసిరారు. దానికి తగ్గట్టే హకర్లు అతని ఇన్ఫర్మేషన్ అందరితో ఇప్పుడు పంచుకొని ఆశ్చర్యపరిచారు.