ఇక సర్వదర్శనానికీ టైంస్లాట్‌లు..తితిదే

Update: 2017-12-13 09:49 GMT

తిరుమలలో స్వామి సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతోంది. సెలవలు వరుసగా కలసి రావటంతో తిరుమల భక్తజన సంద్రమైంది. గత నాలుగు రోజులలో సుమారుగా 3లక్షల 80వేల మంది భక్తులు స్వామిని దర్శించుకున్నారని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. భక్తుల రద్దీ దృష్ట్యా ప్రోటోకాల్‌ వీఐపీలకే పరిమిత సంఖ్యలో టిక్కెట్లు కేటాయిస్తున్నామని చెప్పారు.  రానున్న రోజుల్లో సర్వదర్శనానికీ టైంస్లాట్‌లు పెట్టే ఆలోచన ఉందని వివరించారు.

Similar News