`థగ్స్ ఆఫ్ హిందూస్తాన్` సినిమాలో బిగ్ బి అమితాబ్ బచ్చన్ - మిస్టర్ పెర్ ఫెక్ట్ అమీర్ ఖాన్ - కత్రిన కైఫ్ - సనా షేక్ వంటి నటులు మనని రంజింపచేయడానికి వస్తున్నారు. `ధూమ్ 3` ఫేం విజయ్ కృష్ణ ఆచార్య ఈ సినిమాని తెరకెక్కించడం జరిగింది. ఈ సినిమాకి టాప్ టెక్నీషియన్లతో హాలీవుడ్ స్టాండార్డ్స్లో ఇండియాస్ బెస్ట్ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నామని నిర్మాతలు ఎప్పుడో ప్రకటించారు. అందుకే థగ్స్ పై అందరిలోనూ అంచనాలు పెంచుతూ ఒక హైపుని క్రియేట్ చేస్తుంది. అలాగే ఇప్పుడు ప్రాంతీయ భాషల్లోనూ ప్రచారం మొదైలంది. ముఖ్యంగా తెలుగు - తమిళ్ లోనూ ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. అమితాబ్ - అమీర్ మీ టీవిలో కూడా తెలుగులో ప్రచారం సాగించటం మీరు చూసే వుంటారు. నవంబర్ 8న దీపావళి కానుకగా ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా తారాజువ్వల దూసుకు వస్తుంది. శ్రీ.కో.