పోలీసులనే బెదిరించాడట మంత్రుల,
మనిషినని ,చర్చి గురించిన చర్చలో
వినకుంటే బాగోదని తెలిపాడట,
అధికారులు కనిపెట్టారట కుతంత్రమని. శ్రీ.కో
కేంద్రమంత్రి ఓఎస్డీ పేరుతో ఎస్పీ, సీఐలను బెదిరించిన బోరుగడ్డ అనిల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ చర్చి విషయంలో తాను చెప్పిన వారికి అనుకూలంగా వ్యవహరించాలంటూ పోలీసులను అనిల్ బెదిరించినట్లు తెలుస్తోంది. దీనిపై దృష్టి సారించిన పోలీసులు అనిల్ ఫోన్ నెంబరు ఆధారంగా వివరాలు సేకరించి అతడిని అదుపులోకి తీసుకున్నారు. అనిల్‌పై ఐపీసీ 120(బి), 506,185, 419 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.