టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ కుమారుడు, నిజామాబాద్ మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ పై లైంగిక ఆరోపణలు సంచలనంగా మారాయి. టీఆర్‌ఎస్ రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ కుమారుడు, నిజామాబాద్ మాజీ మేయర్ ధర్మపురి సంజయ్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. సంజయ్ తమను లైంగిక వేధించాడంటూ నేరుగా హోంమంత్రి నాయినికే ఫిర్యాదుచేసి సంచలనం సృష్టించిన శాంకరీ నర్సింగ్ కాలేజీ విద్యార్ధినులు నిజామాబాద్ పోలీస్ కమిషనర్‌ను కలిసి కంప్లైంట్ చేశారు. వికృత ప్రవర్తనతో తీవ్ర వేధింపులకు గురిచేశాడని బాధితులు ఆవేదన వ్యక్తంచేశారు. సంజయ్ నుంచి తమకు ప్రాణహాని ఉందన్న విద్యార్ధినులు రక్షణ కల్పించాలని సీపీని కోరారు. శాంకరీ కాలేజీ గుర్తింపు రద్దుచేసి ఇతర కళాశాలల్లో అడ్మిషన్స్ కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
తనపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలను సంజయ్ కొట్టిపారేశారు. రాజకీయంగా దెబ్బతీయడానికే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. తానెవరితోనూ సహజీవనం చేయడం లేదని, కావాలనే తన ఫ్యామిలీని టార్గెట్ చేశారని ఆవేదన వ్యక్తంచేశారు. సంజయ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు టీఆర్‌ఎస్ అంతర్గత వ్యవహారమన్న అరవింద్ తనకు వ్యక్తిగతంగా డ్యామేజీ జరుగుతుందని అనుకోవడం లేదన్నారు.
ఇదిలా ఉంటే ధర్మపురి సంజయ్‌పై కేసు నమోదుచేసి దర్యాప్తు చేయనున్నట్లు నిజామాబాద్ ఏసీపీ సుదర్శన్ తెలిపారు. విద్యార్ధినుల ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదుచేసి చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. సంజయ్‌పై మొత్తం 11మంది విద్యార్ధినులు ఫిర్యాదుచేశారన్న ఏసీపీ సుదర్శన్ ఈ వ్యవహారంలో ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు లేవన్నారు. అలాగే విద్యార్ధినులకు రక్షణ కల్పిస్తామని చెప్పారు.
సంజయ్‌పై లైంగిక వేధింపులు ఆరోపణలు సంచలంగా మారడంతో డీఎస్ ఇరకాటంలో పడినట్లు తెలుస్తోంది. ఇప్పటికే టీఆర్‌ఎస్‌లో ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్న డీఎస్ కుమారుడిపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలతో మరింత చిక్కుల్లో పడినట్లైయింది.