సంగీతం... సాహిత్యం...సరిపాళ్ళలో కలిస్తే కొన్ని గొప్ప పాటలు అవుతాయి... అలంటి పాటే..ఈ తెలవారదేమో స్వామీ అనే పాట. ఈ పాట 1987లో విడుదలైన శ్రుతిలయలు చిత్రంలోని సుప్రసిద్ధమైన పాట. ఈ పాట రాసినందుకు సిరివెన్నెల సీతారామశాస్త్రి గారికి రాష్ట్రస్థాయిలో ఉత్తమ గీత రచయితగా నంది బహుమతి వచ్చింది. ఈ పాటను గానం చేసింది జేసుదాసు , సంగీతం అందించింది కె.వి. మహదేవన్.
పల్లవి:
తెలవారదేమో స్వామీ తెలవారదేమో స్వామీ
నీ తలపుల మునుకలో అలసిన దేవేరి అలమేలుమంగకూ
తెలవారదేమో స్వామీ
నీ తలపుల మునుకలో అలసిన దేవేరి అలమేలుమంగకూ
తెలవారదేమో స్వామీ
చరణం 1:
చెలువమునేలగా చెంగట లేవని కలతకు నెలవై నిలచిన నెలతకు ||2||
కలల అలజడికి నిద్దుర కరవై ||2||
అలసిన దేవేరి.. అలసిన దేవేరి.. అలమేలుమంగకూ ||తెలవారదేమో స్వామీ||
చరణం 2:
మక్కువ మీరగా అక్కున జేరిచి అంగజుకేళిని పొంగుచు తేల్చగా ||2||
ఆ మత్తునే మది మరి మరి తలచగా .. మరి మరి తలచగా
అలసిన దేవేరి.. అలమేలు మంగకూ
తెలవారదేమో స్వామీ.. గా మ ప ని
తెలవారదేమో సా ని ద ప మ ప మ గ ని స గా
మ
తెలవారదేమో స్వామీ
పా ని ద ప మ గ మ ప స ని ద ప మ గ మ
ప స ని రి స గ రి మ గ రి సా రి నీ స ||తెలవారదేమో స్వామీ||
శాస్త్రీయ సంగీతాన్ని ఇష్టపడేవారందరు... ఈ పాటని ప్రశంసించక ఉండలేరు..శ్రీ.కో.