కంప్యూటర్లలో మునిగితేలే సాఫ్ట్‌వేర్ ఇంజీనర్లకు ఓటేసేందుకు టైం దొరకదు. తమ వీధి సమస్యలకు పరిష్కారమేదో నియోజకవర్గ ప్రజలకు అర్థంకాదు. మ్యానిఫెస్టోలో ఏయే అంశాలు చేర్చాలో పార్టీలకూ పూర్తిగా బోధపడదు. ఇలా సమస్త సమస్యలనూ సవాల్‌గా స్వీకరించి, సొల్యూషన్స్‌కు సానపెట్టబోతోంది పొలిటికల్ హ్యాకథాన్. వినడానికి కొత్త అనిపిస్తున్న, పాశ్చాత్యా దేశాల్లో ఇదొక తారక మంత్రం. దేశంలోనే తొలి పొలిటికల్ హ్యాకథాన్‌కు, వేదిక కాబోతోంది హైదరాబాద్.
హ్యాకథాన్. అనేక రకాల సమస్యల పరిష్కారానికి వేదిక...ప్రాబ్లమ్ ఏదైనా, దాని వెంటపడి, సాధించేంతవరకూ విశ్రమించని పట్టుదల. పాశ్యాత్య దేశాల్లో ఫేమస్ ఛాలెంజ్. ఐటీ రంగంలోని సంస్థల కొత్త ఆలోచనల అమలుకీ, సమస్యల పరిష్కారానికీ అతి తక్కువ సమయంలో సమాధానం వెతికేందుకు, విసిరే సవాల్ హ్యాకథాన్. దీన్ని అందిపుచ్చుకోవాలనీ, ఈ తరం యువత ఉత్సాహపడుతోంది. సమస్యల పరిష్కారంలో ఎప్పటికప్పుడు కొత్త సవాళ్లను అందుకోవడం, లక్ష్యాలను చేరుకోవడం కోసం ఐటి రంగంలో ఈలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు.
ప్రపంచవ్యాప్తంగా హ్యాకథాన్‌కు ఇప్పుడిప్పుడే విశేష ఆదరణ లభిస్తోంది. ఇప్పటి వరకు ఒక సంస్థ మార్పులు, ఆయా సంస్థలో ఉన్న సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసే, హ్యాకథాన్‌ను తొలిసారిగా తెలంగాణ ఎన్నికల సందర్బంగా నిర్వహిస్తున్నారు. తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ సహకారంతో వాయిస్ ఆఫ్ డిజిథాన్, హ్యాకథాన్ బృందం వీకెండ్‌లో ఆర్గనైజ్ చేస్తోంది. దేశంలోనే తొలిసారిగా తెలంగాణ వేదికగా పొలిటికల్ హ్యాకథాన్ ఆర్గనైజ్ చేస్తోంది వాయిస్ ఆఫ్ డిజిథాన్, హ్యాకథాన్ బృందం. ఓటుకు ఎప్పుడూ దూరంగా ఉండే టెకీలను ఓటేసేలా ప్రోత్సహించడంతో పాటు నియోజకవర్గాలవారిగా అనేక సమస్యలను, ఎన్నికల ప్రక్రియలో ప్రాబ్లమ్స్‌నూ కూడా హ్యాకథాన్‌లో చేర్చారు. సచివాలయంలో ఎన్నికల అధికారులను కలిసిన, తెలంగాణ ఐటీ అసోసియేషన్ సభ్యులు, హ్యాకథాన్‌పై చర్చించారు.
రోజంతా జరిగే ఈ హ్యాకథాన్‌లో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ, ఓటింగ్ శాతం పెంచేందుకు ఫాలో కావాల్సిన టెక్నిక్‌లు, మహిళలు, వృద్దులకు, దివ్యాంగులకు మరింత అవగాహన పెంచేందుకు, ఈ హ్యాకథాన్ ఉపయోగపడుతుందని ఆర్గనైజర్స్ చెబుతున్నారు. పొలిటిట్ పార్టీలు వారి మ్యానిఫెస్టోలో పెట్టాల్సిన అంశాలు వాటి పరిష్కార మార్గాలు సైతం హ్యాకథాన్‌లో పాల్గొనే యువత, విలువైన సూచనలు, పరిష్కారాలను నివేదిక రూపంలో ఇస్తారు. దేశంలో ఎక్కడా పొలిటికల్ హ్యాకథాన్ జరగలేదని, ఇప్పటివరకు అమెరికాలోని టెక్సాస్‌లో ఒక్కసారే జరిగిందని అంటున్నారు తెలంగాణ పొలిటికల్ హ్యాకథాన్ నిర్వాహకులు. రాజకీయ నాయకుల ప్రత్యక్ష భాగస్వామ్యంతో పలు సవాళ్లకు ఈ వేదికగా పరిష్కారాలు చూపించడమే పొలిటికల్ హ్యాకథాన్ ప్రధాన ఉద్దేశమని అంటున్నారు.