ప్రభుత్వ నిర్ణయంతో టీఆర్ఎస్ కే ఎక్కువ లాభం

Update: 2018-08-18 05:54 GMT

ముందస్తు ఎన్నికలపై ముమ్మర ప్రచారం జరుగుతున్న వేళ గుర్తింపు పార్టీలకు వారి ఆఫీస్ ను నిర్మించేందుకు భూములను ఇచ్చేందుకు మార్గదర్శకాలను జారి చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఇందుకు సంబందించిన పార్టీ కార్యాలయాలకు స్థలాలను లీజుకు ఇచ్చే పాలసీని సవరించి, నామమాత్రపు ధరకు కేటాయించేలా ఓ పాలసీని రూపొందించింది. కొత్త పాలసీకి మంత్రివర్గం ఆమోదం లభించిన నేపథ్యంలో రెవెన్యూశాఖ  జారీ చేశారు.  

తెలంగాణలోని పార్టీలు ఇక తమకు భూమి కేటాయించండని సర్కార్ చూట్టు కాళ్ళారిగేలా తిరగాల్సిన పని లేదు. గుర్తింపు పొందిన పార్టీలకు వారి పార్టీ అఫీస్ లను నిర్మించేందుకు కొత్త విధానం తీసుకువచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. ఇటీవల క్యాబినేట్ భేటిలో పార్టీ కార్యాలయాలకు ప్రభుత్వ భూములిచ్చేందుకు అనుకూలంగా చేసిన నిర్ణయం మేరకు రెవిన్యూ శాఖ జివో 168 ని విడుదల చేసింది. దీంతో గతంలో అనుసరించిన లీజు విధానానికి సర్కార్ స్వస్తి పలికింది. 

ఇప్పటి వరకు రాజకీయ పార్టీల కార్యాలయాల నిర్మాణాల కోసం ఏ ప్రభుత్వమైనా కాల పరిమితో కూడిన లీజు విధానంతో భూములు ఇచ్చేది. అయితే, ప్రస్తుత టిఆర్ఎస్ సర్కార్ ఈ పద్దతికి స్వస్తి పలికింది. పార్టీ కార్యాలయాలకు స్థలాలను లీజుకు ఇచ్చే పాలసీని సవరించి, నామమాత్రపు ధరకు కేటాయించేలా పాలసీని రూపొందించింది. ఇక నుంచి జిల్లా కేంద్రాల్లో పార్టీ కార్యాలయల నిర్మాణాల కోసం శాశ్వత ప్రతిపాదికగా భూములు అప్ప చెప్పనుంది. జివో 168 ప్రకారం, పార్టీలు నేరుగా వంద రూపాయిలకే గజం భూమిని కట్టబెట్టనుంది. రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్వి రాజేశ్వర్‌ తివారీ జీవో 168 జారీ చేశారు. 

ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో అధికంగా లభ్ది పోందేది అధికార పార్టీ టిఆర్ఎసే. ఎందుకంటే రాష్ట్రంలోని గుర్తింపు పొందిన పార్టీలన్నింటికి ఇప్పటికే ప్రభుత్వం నుంచి ట్రస్టుల రూపంలోనో, లేక నేరుగానో పార్టీ కార్యాలయాలు కొనుగొలు చేసి నడుస్తున్నాయి. కానీ ఇప్పటిదాకా టిఆర్ఎస్ పార్టీకి అధికారిక భవనాలు ఎక్కడా లేవు. కాబట్టి వంద రూపాయిలకే గజాం స్ధలం టిఆర్ఎస్ కోసమేననే విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే, తమకు కూడా ఎంతో కొంత లబ్ధి కోరనుందని ఇతర పార్టీలు సైతం సైలెంట్ గా ఉన్నాయి. 

వాస్తవానికి  క్యాబినేట్ లో భూములు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నప్పటికి దానికి ప్రతిపాదికలు, మార్గదర్శకాలు తయారు చేసేందుకు మరికొంత సమయం పట్టేది. కానీ ముందస్తు ఎన్నికలకు వెళ్ళాలన్న ఉద్దేశ్యంతో ఉన్న అధికార పార్టీ అప్పిలుతో రెవిన్యూ శాఖ స్పీడ్ గా ఉత్తర్వూలు జారీ చేసిందని అంటున్నాయి సచివాలయ వర్గాలు. 
 

Similar News