స్వాతి కిరణం 1992 లో కె. విశ్వనాథ్ దర్శకత్వంలో విడుదలైన సంగీత ప్రధానమైన చిత్రం. ఇందులో మమ్ముట్టి, రాధిక, మాస్టర్ మంజునాథ్ ముఖ్య పాత్రల్లో నటించారు. సాంప్రదాయ సంగీత గురువు తన శిష్యుడి ఉన్నతిని తట్టుకోలేక ఈర్ష్యకు లోనై అతని మరణానికి కారణమై చివరికి తన తప్పును తెలుసుకునే కథ. ఈ చిత్రంలో గణపతి సచ్చిదానంద స్వామి కనిపిస్తాడు. ఆనతి నీయరా పాట పాడిన వాణి జయరాం జాతీయ ఉత్తమ గాయనిగా ఎంపికైంది. ఈ సినిమా మీరు ఇప్పటివరకు చూడకుంటే మాత్రం, తప్పక చూడాల్సిన సినిమా . శ్రీ.కో.