సొంత వ్యాపారం పెట్టుకోవాలని చాల మంది ఉద్యోగులు కల కంటుంటారు.. అయితే .... ఉద్యోగంలోని భద్రతకి ... వ్యాపారంలోని.. అభివ్రుద్దికి.. మద్య భయం... సామాన్యులను వణికిస్తుంది... అలాంటి కథనే...ఈ....”సుయి దాగా”… ( సూది దారం) అనే టైటిల్ తో ఈ మద్య ఒక హింది చిత్రం వచ్చింది. ఈ సినిమా ఒక సామాన్య మానవుడి సొంత వ్యాపారంలో నిలబడే.. జీవితపు పోరాట కథ. వరుణ్ ధావన్ హీరోగా అలాగే...అతని భార్య మమతగా అనుష్క శర్మ నటించింది. ఈ సినిమాలో హీరో తనని బాగా ఇబ్బంది పెట్టె యజమానిని వదిలి, బార్య ప్రోత్సాహం తో తనే ఒక సొంత వ్యాపారం పెట్టాలను కుంటాడు. కానీ అలా నిర్ణయించుకుంది మొదలు.. రకరకాల సమస్యలు... మరియు సహాయం చేయని.. బంధువులు మధ్య విజయవంతమైన వ్యాపారవేత్త అవుతాడ .. కాడా అనేదే సినిమా కథ ? దర్శకుడు శరద్ కటారియా ఈ చిత్రం చాలా వాస్తవానికి దెగ్గరగ తీసాడు. అలాగే అనుష్క-వరుణ్ యొక్క అత్యుత్తమ నటనకు ఈ చిత్రంలో మనం చూడవచ్చు. సొంత వ్యాపారం యొక్క లొతు... పాట్లు బాగా చూపెట్టారు. శ్రీ.కో.