టీవీ యాంకర్ మంగ్లి నోట,
శైలజా రెడ్డి అల్లుడు చూడే పాట,
ఉపెస్తోంది యువతని ఈ పూట,
అంటున్నారు ఎందరో బాగుందనే మాట. శ్రీ.కో.
కాసరల శ్యాం వ్రాసిన “శైలజ రెడ్డి అల్లుడు చూడే” అనే ఈ పాటను ప్రముఖ టీవీ యాంకర్ మంగ్లి (సత్యవతి )పాడారు. ఈ శైలజా రెడ్డి అల్లుడు చూడే అనే పాట ఓ జానపద ఆధారిత కంటెంట్లా వినబడుతోంది. కాసారల శ్యాం ఈ పాటను తెలంగాణ శైలిలో చాలా చక్కని పదాలతో వ్రాయటం జరిగింది. ఈ పాట ఇప్పుడు అందరి పెదాలపై పలుకుతువుంది. ఈ సినిమా ఓపెనింగ్స్కి కూడా బాగా సహాయపడుతుంది అంటున్నారు సినీవర్గాలు. శ్రీ.కో.