నేతల ఒత్తిడి కబడ్డిపై

Update: 2018-08-22 09:34 GMT

కృష్ణాజిల్లా కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి తాగెను,

పురుగుల మందు,  అతని పరిస్థితితో అందోళసాగేను,

ఆత్మహత్యాయత్నానికి ముందు సెల్ఫీ వీడియోలో చెప్పెను,

తన మరణంతో అయినా న్యాయం జరుగటం ఒప్పని. శ్రీ.కో. 


కృష్ణా జిల్లా కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి శ్రీకాంత్ ఆత్మహత్యాయత్నం చేశాడు. పురుగుల మందు తాగడంతో అతని పరిస్థితి విషమంగా ఉంది. ఆత్మహత్యాయత్నానికి ముందు సెల్ఫీ వీడియో కూడా తీశాడు. క్రీడాకారులకు అన్యాయం చేసిన వీరలంకయ్యకు తెదేపా నేత కేఈ ప్రభాకర్ అండగా ఉంటున్నారని అతను వీడియోలో తెలిపాడు. తనకు వారి నుంచి ప్రాణహాని ఉందని, తన మీద కోపంతో క్రీడాకారులను ఇబ్బంది పెడుతున్నారని తెలిపాడు. తన మరణంతో అయినా న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నానని శ్రీకాంత్‌ సెల్ఫీ వీడియో ద్వారా చెప్పాడు.

Similar News