బీహార్ నుండి ..జమ్ము కశ్మీర్ వరకు

Update: 2018-08-23 10:03 GMT

బీహార్ గవర్నర్‌గా ఉన్న సత్యపాల్‌ను,

జమ్ము కశ్మీర్ కొత్త గవర్నర్‌గా నియమించెను,

సత్యపాల్ గురువారం ప్రమాణస్వీకారం చేసి, 

కొత్త బాద్యతలు తీసుకొని, కొత్త సవాళ్ళకి సిద్ధమని,

ప్రకటించెనా. శ్రీ.కో. 

జమ్ము కశ్మీర్ కొత్త గవర్నర్‌గా సత్యపాల్ మాలిక్ గురువారం నాడు  ప్రమాణస్వీకారం చేశారు. 2008 నుంచి గవర్నర్‌గా ఉన్న ఎన్ఎన్ వోహ్రా స్థానంలో సత్యపాల్ మాలిక్ బాధ్యతలు స్వీకరించారు. మంగళవారం రాష్ట్రపతి ఏడు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను ప్రకటించిన విషయం మనందరికి తెలిసిందే. అందులో భాగంగానే ఇప్పటివరకు  బీహార్ గవర్నర్‌గా ఉన్న సత్యపాల్‌ను జమ్ముకశ్మీర్‌కు మార్పు చేశారు. ఆయన స్థానంలో బీహార్ గవర్నర్‌గా లాల్జీ టాండన్ నియమితులయ్యారు.


 

Similar News