శివాజీ రావు గైక్వాడ్ గా పుట్టి రజనికాంత్గా అపారమైన పేరు సంపాదించాడు మన రోబో రజని, ప్రధానంగా తమిళ్ సినిమాలో ఎక్కువ పనిచేసేనా, భారతీయ చలనచిత్ర నటుడుగా మరియు రాజకీయవేత్తగా ప్రపంచంలో బాగా గుర్తింపు పొందుతున్నాడు. బస్సు కండక్టర్ గా బెంగళూరు ట్రాన్స్పోర్ట్ సర్వీస్ లో పనిచేస్తున్నప్పుడు మన రజని నటించడం మొదలుపెట్టాడు. 1973 లో ఇతను నటన లో డిప్లొమా కొనసాగించడానికి మద్రాస్ ఫిలిం ఇన్స్టిట్యూట్లో చేరారు. K. బాలచందర్ యొక్క తమిళ అపూర్వ రాగాంగల్ (1975) లో తన తొలిసారిగా నటించాడు. తన నటనా వృత్తిని తమిళ్ చిత్రాలలో విభిన్న పాత్రలతో పోషించటం ప్రారంభించారు. అలా ఎదిగి ఈ రోజు రోబో2 గా మనని అలరిస్తున్నాడు. శ్రీ.కో.