బీడబ్యూఎఫ్ ప్రపంచ టూర్‌లో బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు చరిత్ర సృష్టించింది. ఫైనల్స్‌లో జపాన్‌కు చెందిన రెండో సీడ్ ఒకుహరపై ఘన విజయం సాధించింది. గత ఏడాది ఈ టోర్నీలో రన్నరప్‌గా నిలిచిన సింధు.. ఈ ఏడాది టైటిల్‌ను సాధించి ఈ ఘనత సాధించిన తొలి భారతీయ మహిళా క్రీడాకారిణిగా రికార్డు నెలకొల్పింది. ఆదివారం జరిగిన ఫైనల్లో సింధు 21-19, 21-17 తేడాతో నొజోమి ఒకుహారా(జపాన్)ను ఓడించి విజేతగా అవతరించింది. తాజా విజయంతో భారత బ్యాడ్మింటన్ చరిత్రలో తొలిసారి స్వర్ణం దక్కినట్లైంది.