వరంగల్ వెస్ట్ లో ముందస్తు జోరు

Update: 2018-07-12 10:58 GMT

ముందస్తు ఎన్నికలు వస్తాయో లేదో తెలీదు కానీ గ్రేటర్ వరంగల్ లో మాత్రం ఆ జోరు కనిపిస్తోంది. టిఆరెస్ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ కు ఈసారి గట్టి పోటీ తప్పేలా లేదు. టిఆరెస్ సంక్షేమ యాత్రలు చేస్తుంటే..  ప్రతిపక్షాలు ప్రజా సంకల్ప యాత్రలు చేస్తున్నాయి మరోవైపు మేం కూడా ఉన్నామని బరిలోకి దిగుతోంది బీజేపీ  దాంతో ఈసారి వరంగల్ పశ్చిమలో త్రిముఖ పోటీ తప్పేలా లేదు.

గ్రేటర్ వరంగల్ లో ముందస్తు ఎన్నికల హడావుడి కనిపిస్తోంది. ఎన్నికలెప్పుడొచ్చినా గెలవాలన్న పట్టుదలతో అభ్యర్ధులు ఎవరి ప్రయత్నాలు వారు చేసుకుంటున్నారు. వర్దన్న పేట ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ బస్తీ బాట పేరుతో వారంలో రెండు రోజులు నియోజక వర్గంలోని కాలనీలు, అపార్ట్ మెంట్స్ లో తిరుగుతు సమావేశాలు ఎర్పాటు చేస్తున్నారు. మరోవైపు నగరంలోని సమస్యలపై పాదయాత్ర పేరుతో కాంగ్రెస్ డిసిసి నాయిని రాజేందర్ రెడ్డి నగరంలోని అన్ని డివిజన్స్ తిరుగుతున్నారు. కానీ ఎక్కువ పశ్చిమ నియోజక వర్గంపైనే దృష్టి పెట్టారు. ఈ పాదయాత్రలో రాష్ట్ర కాంగ్రెస్ నేతలు పాల్గోనడంతో వాతవరణం కాస్తా వేడెక్కింది. 

ఈ సారి ఎన్నికలు పశ్చిమలో రసవత్తరంగా సాగనున్నయి. గతంలో కాంగ్రెస్ వారు లోకల్ లీడర్లు కాకపోవడం దాస్యం కు కలిసొచ్చింది. కానీ ఈ సారి నాయిని రాజేందర్ రెడ్డి పోటీలో నిలుస్తే గెలుపు కష్టమే. నాయినికి ఈ నియోజకవర్గం మీద పూర్తి పట్టు ఉంది. సీనియర్ అయినా ఒక్కసారి కూడా పార్టీ టిక్కెట్ ఇవ్వకపోవడంతో ప్రజల్లో సింపతీ ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో  రెండు పర్యాయాలు గ్రంధాలయ చైర్మెన్ గా చేసినా ఎక్కడా అవినీతి మరక లేని వ్యక్తి. దీంతో ఈ సారి దాస్యంకు గట్టి పోటి తప్పదని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. టీడీపీ మాజీ మంత్రి ప్రణయ్ బాస్కర్ తమ్ముడిగా రాజకీయ అరంగేట్రం చేసిన దాస్యం 2004లో ఇండిపేండెంట్ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. 2006లో టిఅర్ ఎస్  కార్పోరెటర్ గా గెలిచారు.. 2009లో ఎమ్మెల్యేగా గెలిచినా  కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండటంతో అనుకున్న స్దాయిలో అభివృద్ది చేయలేక పోయాడు. 2014లో టిఅర్ ఎస్ ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత కాళోజీ కళాక్షేత్రం, జయశంకర్ స్మృతివనం పేరిట ఎకశిలా పార్కును మార్చబోతున్నారు. దాంతో పాటూ ప్రతిష్టాత్మక డబుల్ బెడ్ రూం పథకానికి కేసిఆర్ ఇక్కడ నుంచే శ్రీకారం చుట్టారు. హన్మకొండ, న్యూశాయంపేటలో సూమారుగా 2 వేల డబుల్ బెడ్ రూం ఇళ్ళ పనులు నడుస్తున్నాయి. అయితే స్థానిక సమస్యలు, కాలనీల మౌలిక సదుపాయాల కల్పన దాస్యం పట్టించుకోరన్నది పబ్లిక్ టాక్. ప్రారంభించిన పనులేవీ ఇప్పటి వరకూ పూర్తికాలేదు.  ఇది దాస్యంకు కాస్త వ్యతిరేకతను తెచ్చే లా ఉంది.

టీఅర్ఎస్, కాంగ్రెస్ మధ్య కోల్డ్ వార్ తప్పదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. దీనికి తోడు బీజేపీ సైతం వరంగల్ పశ్చిమ సీటుపైనే కన్నేసింది. గత వారం బీజేపీ జన చైతన్య యాత్ర, హన్మకొండలో జరిగిన బహిరంగ సభ సక్సెస్ కావడంతో మేం సైతం పోటీకి రెడీ అంటోంది బీజేపీ.  అయితే ఇక్కడ బీజేపీ సీటు కోసం ఇద్దరు పోటీలో ఉన్నారు. ఒకసారి ఎమ్మెల్యే అయిన మార్తిన ధర్మారావు, బిజెపి జిల్లా అధ్యక్షురాలు పద్మ కూడా పశ్చిమ సీటుపైన కన్నేశారు. పార్టీ టిక్కెట్ ఎవరికి ఇచ్చినా ఈ సీటుకు త్రిముఖ పోటీ తప్పేలా లేదు. ముందస్తు ఎన్నికల ఉహగానాల నేపధ్యంలో కాంగ్రెస్, టిఆరెస్ నిత్యం ప్రజల మధ్య ఉంటు ఎన్నికల వేడిని పెంచుతున్నారు. అందుకే వరంగల్ పశ్చిమలో ఎన్నికల కోలహలం కనిపిస్తోంది.

Similar News