మొన్న సోషల్ మీడియాలోబీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన ఫిర్యాదుపై హైదరాబాద్ పోలీసులు సినీ విశ్లేషకుడు, తన పదునైన విమర్శలతో ప్రతిరోజు వార్తల్లో నిలిచే కత్తి మహేశ్ పై కేసు నమోదు చేశారు. జనసేన అధినేత సినీ నటుడు పవన్ కళ్యాణ్ ను విమర్శించే క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీపై కత్తి మహేశ్ అసభ్యకర వ్యాఖ్యలు చేసారని ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపించిన సంగతి తెలిసిందే.
మోదీని విమర్శిస్తూ చౌకబారు ప్రచారం కోసం మహేశ్ ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు. మోదీని హంతకుడిగా అభివర్ణించిన ఆయనపై కేసు పెట్టాలని రాజాసింగ్ డిమాండ్ చేయగా, దాని ఆధారంగా పోలీసులు కేసు రిజిస్టర్ చేసి విచారణ మొదలు పెట్టారు. కాగా, చట్టం తెలియని ఓ వ్యక్తి, ట్విట్టర్ లో ఫిర్యాదు చేస్తే తనపై ఇటువంటి కేసులేమి ప్రభావం చూపవని కట్టి మహేష్ అన్నారు..