సేద్యంలో సామాన్య రైతుకు ఇది సాద్యమా?

Update: 2018-08-09 11:12 GMT

వరి పరిశోధన సంస్థ క్షేత్రంలో మంత్రిగారు,

వరినాటు యొక్క యంత్రాలను పరిశీలించారు,

ట్రాన్స్‌ప్లాంటర్ సాయంతో మంత్రి వరినాట్లు వేశారు

కానీ ఇదంతా సేద్యంలో సామాన్య రైతుకు సాద్యమసారు. శ్రీ.కో


జయశంకర్ వ్యవసాయ వర్సిటీ వరి పరిశోధన సంస్థలో వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా వరినాటు యంత్రాలను మంత్రి పోచారం పరిశీలించారు. వరి పరిశోధన సంస్థ క్షేత్రంలో ట్రాన్స్‌ప్లాంటర్ సాయంతో మంత్రి.. వరినాట్లు వేశారు. వ్యవసాయ యాంత్రీకరణపై రైతులతో పోచారం శ్రీనివాస్‌రెడ్డి ముఖాముఖి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథి, ఉద్యానశాఖ కమిషనర్ వెంకట్రామిరెడ్డి, వ్యవసాయ వర్సిటీ వీసీ ప్రవీణ్ రావు, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.
 

Similar News