చైనా అణుచూపు అమెరికా వైపా?

Update: 2018-08-17 08:02 GMT

అణు బాంబర్లను చైనా తయారు చేస్తున్నదట,

అని పెంటగాన్ నివేదికను విడుదల చేసెనట,

అమెరికాను అణు బాంబర్లతో టార్గెట్ చేసేందుకేయిదట,

పైలట్లకు శిక్షణ కూడా అని నివేదికలో వెల్లడించనట,

ప్రపంచ పెద్దన్నయకి ఎప్పుడు భయమే! ఎందుకో? శ్రీ.కో. 

అణు బాంబర్లను చైనా తయారు చేస్తున్నదని అమెరికాకు చెందిన పెంటగాన్ నివేదికను విడుదల చేసింది. అమెరికాను అణు బాంబర్లతో టార్గెట్ చేసేందుకు పైలట్లకు శిక్షణ కూడా ఇస్తున్నదని ఆ నివేదికలో వెల్లడించారు. చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ గత మూడేళ్లుగా అణు బాంబర్ విమానాలను డెవలప్ చేస్తున్నది. సముద్రజల మార్గాలపైన కూడా చైనా పట్టు సాధిస్తున్నది. అమెరికాతో పాటు దాని మిత్ర దేశాలపై దాడి చేసేందుకు చైనా ఆ అణు బాంబర్లను తయారు చేస్తున్నట్లు తెలుస్తోంది. సుదీర్ఘ దూరం ప్రయాణించే బాంబర్ విమానాలను చైనా రూపొందిస్తున్నట్లు పెంటగాన్ తన రిపోర్ట్‌లో పేర్కొన్నది. న్యూక్లియర్ మిషన్‌ను చైనా వాయుదళం సీరియస్‌గా చేపట్టిందని తెలుస్తోంది.
 

Similar News