ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత వైయస్ జగన్మోహన్ రెడ్డి అవినీతిపరుడనే కారణంతోనే గత ఎన్నికల్లో మద్దతు ఇవ్వలేదని తెలిపిన పవన్ కళ్యాణ్, చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేసారు.. రాష్ట్రం విడిపోయిన తరువాత బీజేపీ అంటే తనకు పెద్దగా ఇష్టం లేకపోయినా.. తాను రాష్ట్ర అవసరాల రీత్యా బీజేపీకి మద్దతు ఇచ్చాను. అలాగే చంద్రబాబు వ్యక్తులను వాడుకుని వదిలేస్తారని తెలిసినా.. తాను టీడీపీకి విజయానికి కృషి చేశాను.. కానీ ఇవాళ టీడీపీ సరిగా పని చేయడంలేదనే భావన నాలో ఉంది.. అని అన్నారు..
ఇటు జనసేనాని చంద్రబాబుపై సడెన్ గా ఇలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేసారని రాజకీయవర్గాల్లో హాట్ హాట్ గా చర్చ జరుగుతుంది. జగన్ ను విమర్శించాడంటే అది రాజకీయవైరం అనుకోవచ్చు, కానీ ఎ శత్రుత్వం లేని జనసేన , టీడీపీకి ఎక్కడ చెడింది..? పవన్ చంద్రబాబుపై యుద్ధం ప్రకటించాడా..? లేక రాజకీయ వ్యూహంలో భాగమా..? అనే విషయమై స్పష్టత రావాల్సి ఉంది.. ఇదిలావుంటే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పరిపాలన సరిగా చేయడంలేదనే అభిప్రాయంలో భాగంగా ఇలాంటి వ్యాఖ్యలు చేసారు అనేది వైసీపీ వాదన.. మరి ఎవరి వాదన ఎలా ఉందొ తెలియాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే..