సిద్దం మేము..ప్రకటిస్తున్నాము చూడు

Update: 2018-08-14 06:42 GMT

రాబోయే ఎన్నికలకు తెరాస సిద్ధమనే,

సెప్టెంబరులోనే అభ్యర్థులను ప్రకటిస్తామనే,

ఒంటరిగానే ఎన్నికల బరిలో దిగుతామననే

సెప్టెంబరు రెండున బహిరంగ సభ అవుతదనే. శ్రీ.కో 


రాబోయే ఎన్నికలకు సెప్టెంబరులోనే తమ పార్టీ అభ్యర్థులను ప్రకటిస్తామని, ఒంటరిగానే బరిలోకి దిగుతామని టీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. సెప్టెంబరు రెండున హైదరాబాద్‌లో ప్రగతి నివేదన బహిరంగ సభను నిర్వహిస్తామని ప్రకటించారు. తమ ప్రభుత్వం చేపట్టిన పథకాలు, కార్యక్రమాలను ఇందులో ప్రజలకు తెలియజేస్తామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక విభజన హామీలపై పోరాటం చేసిందన్నారు. వెంటనే వాటిని నెరవేర్చే ప్రక్రియను వేగవంతం చేయాలని కేంద్రాన్ని డిమాండ్‌ చేశారు. ప్రధాని మోడీ నాలుగేండ్లుగా తియ్యటి మాటలు చెబుతున్నారేగాని, చేతల్లో హామీల అమలు లేదని విమర్శించారు. టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యవర్గ సమావేశం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో జరిగింది. కార్యవర్గంలో తీసుకున్న పలు నిర్ణయాలను విలేకర్ల సమావేశంలో వెల్లడించారు. ముందస్తు ఎన్నికలకు పోతున్నారా అనే ప్రశ్నకు ఇప్పటికే ఎన్నికల ముగ్గులోకి వచ్చామని, ఇక ముందస్తు ప్రస్తావన ఎక్కడిదని ఎదురు ప్రశ్న వేశారు. రాహుల్‌గాంధీ కుటుంబపాలన గురించి మాట్లాడటం హాస్యాస్పదమనీ, ఢిల్లీ కుటుంబపాలన కంటే తమదే నయమని అన్నారు. రాహుల్‌గాంధీకి కేసీఆర్‌ భయపడడని స్పష్టం చేశారు. ఓయూలో సమావేశానికి వీసీ అనుమతించలేదనీ, తమకు సంబంధం లేదన్నారు.
 

Similar News